Aishwaryaa: రజనీకాంత్ కుమార్తె నివాసంలో భారీ చోరీ
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) నివాసంలో దొంగతనం జరిగింది. బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.
చెన్నై: రజనీకాంత్ (Rajinikanth) పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలోనే చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్టెల్కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!