Ajay Bhupathi: మరో ఆసక్తికర టైటిల్‌తో RX 100 డైరెక్టర్‌...!

ఆర్‌ఎక్స్‌100 డైరెక్టర్‌ మూడో సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు వెరైటీగా ‘మంగళవారం’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. 

Published : 18 Nov 2022 15:04 IST

హైదరాబాద్‌: తొలి సినిమా ఆర్‌ఎక్స్‌ 100తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. యథార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. పాటలు, డైలాగ్‌లతో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం అలాంటి కథతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు అజయ్. ఈసారి సినిమా టైటిల్‌తోనే మరింత ఆసక్తి కలిగిస్తున్నారు. తన మూడో సినిమాకు ‘మంగళవారం’ అనే పేరును ఖరారు చేశారట ఈ యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌.

ఆర్‌ఎక్స్‌ 100 తరహాలోనే ఈ సినిమా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో హర్రరతో పాటు తగినంత వినోదాన్ని కూడా జోడించనున్నారు. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాగా అలరించనున్న ఇందులో కథానాయిక ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఈ మూవీని అజయ్‌ స్వయంగా నిర్మించనున్నట్లు సమాచారం. తన సన్నిహితులతో కలిసి ఈ సినిమాను చేయనున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించి 2023 వేసవి కానుకగా ఈ సినిమాను అందించాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే  వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని