Maidan Movie: అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’ చిత్రం విడుదల ఎప్పుడంటే..

సందేశాత్మక, దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా కనిపించే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌.. ఈ సారి ఫుట్‌బాల్‌ కోచ్‌గా ‘మైదాన్‌’ చిత్రంలో సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్ర పోషించనున్నారు.భారతీయ ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి అమిత్‌శర్మ దర్శకత్వం వహించారు. 

Updated : 01 Oct 2021 07:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందేశాత్మక, దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా కనిపించే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌.. ఈ సారి ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రను మైదాన్‌ చిత్రంలో పోషించనున్నారు.భారతీయ ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి అమిత్‌శర్మ దర్శకత్వం వహించారు.  గురువారం ఈసినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు హీరో అజయ్‌ దేవగణ్‌.. ‘మైదాన్‌’ థియేటర్లలో 2022 జూన్‌3న విడుదలవుతున్నట్లు అజయ్‌ దేవగణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రాబోతుందని.. ఈ కథ అందరిని ఆలోచింపజేసేలా ఉంటుందన్నారు. దక్షిణాది హీరోయిన్ ప్రియమణి ఇందులో కథానాయిక. గజ్రాజ్‌ రావ్‌, రుద్రానిల్‌ ఘోష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలుగా  జీ స్టూడియోస్‌ సంస్థ, బోనికపూర్‌ వ్యవహరించనున్నారు. 

ఆయన ఆటకు సెల్యూట్‌: నిర్మాత బోనికపూర్‌
చాలా మందికి భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ గురించి తెలియకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ ప్రముఖ కోచ్‌గా పేరొందారు. ఆయన నాయకత్వంలో 1951 , 1962లో భారత ఫుట్‌ బాల్‌ టీమ్‌ ఆసియా గేమ్స్‌లో విజయం సాధించింది. అలాంటి క్రీడాకారుడి గురించి అందరూ తెలుసుకోవాలి. ఆయన విజయాలకు మనందరం సెల్యూట్‌ చేయాలి. ఆయన టీమ్‌లో చున్ని గోస్వామి, పీకే బెనర్జీ, బాలారామ్ ఫ్రాంకో, అరుణ్‌ ఘోష్‌ వంటి హీరోలున్నారు. యువకులను ఫుట్‌బాల్ ఆడేలా ఈ చిత్రం ప్రేరేపిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని