Ajay Devgn: నా వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆస్కార్ వచ్చింది: అజయ్ దేవ్‌గణ్
తన తదుపరి చిత్రం ‘భోలా’ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో సందడి చేశారు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn). ఇందులో భాగంగా ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆస్కార్‌కు రావడంపై స్పందించారు.
ముంబయి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రానికి ‘ఆస్కార్’ (Oscars) రావడం పట్ల బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) స్పందించారు. తన వల్లే ఆస్కార్ వచ్చిందంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘భోలా’ (Bholaa) ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆయన్ని.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఆస్కార్ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’’ అని వ్యాఖ్యాత కోరాడు. దీనిపై అజయ్ స్పందిస్తూ.. ‘‘నా వల్లే ఆస్కార్ వచ్చింది. ఒకవేళ నేనే ఈ పాటకు డ్యాన్స్ చేసుంటే ఏమయ్యేదో తెలుసుగా..!’’ అంటూ సరదాగా నవ్వులు పూయించారు. ఆయన మాటతో ఆ షోలో ఉన్న వారందరూ చిరునవ్వులు చిందించారు.
‘దృశ్యం 2’ తర్వాత అజయ్ దేవ్‌గణ్ నటించిన చిత్రం ‘భోలా’. తమిళంలో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్న కార్తి ‘ఖైదీ’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. టబు కీలకపాత్ర పోషించారు. మార్చి 30 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయానికి గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇందులో అజయ్‌దేవ్‌గణ్ కీలకపాత్ర పోషించారు. సీతారామరాజు తండ్రి పాత్రలో ఆయన కనిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
India News
Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్ జంట