కరోనా వేళ..అజయ్ ఆపన్న హస్తం

కరోనా మహమ్మారితో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న దేశాన్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకువస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కొవిడ్ పోరాటంలో భాగంగా తనవంతుగా బృహన్‌ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ)కు అండగా నిలిచారు. 

Updated : 29 Apr 2021 07:54 IST

బీఎంసీకి అండగా నిలిచిన నటుడు

ముంబయి: కరోనా మహమ్మారితో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న దేశాన్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కొవిడ్ పోరాటంలో భాగంగా తనవంతుగా బృహన్‌ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ)కు అండగా నిలిచారు. 

అజయ్‌ తన ఎన్‌వై ఫౌండేషన్స్ ద్వారా ముంబయిలోని శివాజీ పార్క్‌లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించారు. కరోనా బాధితుల చికిత్స నిమిత్తం.. బీఎంసీ శివాజీ పార్క్‌లోని వివాహ వేదికలను కొవిడ్ కేంద్రాలుగా మార్చింది. వాటిలో 20 పడకలను ఏర్పాటు చేయడంతో పాటు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర వైద్య సేవలను అందుబాటులో ఉంచింది. ‘అజయ్ దేవ్‌గణ్ బీఎంసీకి మద్దతు ఇవ్వడం గొప్ప విషయం’ అంటూ ఈ సందర్భంగా శివసేన నేత ఒకరు కొనియాడారు. గతేడాది కరోనా మొదటి దశలో కూడా ముంబయిలోని మురికవాడ ధారావికి వెంటిలేటర్లు అందించి ఆదుకున్నారు. 

ఈ తానాజీ నటుడితో పాటు ఆనంద్ పండిట్, బోనీకపూర్, లవ్‌ రంజన్, రజనీశ్‌ కనుజా, లీనా యాదవ్‌, సమీర్ నాయర్, రిషి నేగి వంటి పలువురు సినీ ప్రముఖులు కోటి రూపాయలకు పైగా బీఎంసీకి విరాళంగా అందజేశారు. ఇక, సోనూసూద్ విషయానికొస్తే.. కరోనా దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఆయన తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీరికి నటి తాప్సి కూడా జతకలిశారు. ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఆక్సిజన్ సిలిండర్లు, అవసరమైన మందులు ఎవరి దగ్గర లభ్యమవుతాయో వాళ్ల సమాచారాన్ని నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు