Ajay Devgn: టబు కళ్లను మెచ్చిన హోస్ట్.. అజయ్ దేవ్‌గణ్ రియాక్షన్‌కి నవ్వాల్సిందే!
‘ది కపిల్‌శర్మ షో’లో ‘దృశ్యం 2’ టీమ్ సందడి. అతిథులుగా హాజరైన అజయ్ దేవగణ్, టుబు, శ్రియ నవ్వులు పంచారు.
ముంబయి: నటి టబు (Tabu) కళ్లకు ఓ హోస్ట్ ఫిదా అయ్యారు. ‘మీ కళ్లలో ఏదో మత్తు’ ఉంది అంటూ పొగిడారు. ‘ఆమె నయనాలు అంత బాగుంటే మరి నావి? చెరుకు రసంతో నిండాయా’ అంటూ పక్కనే ఉన్న నటుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కౌంటర్ వేసి, నవ్వులు పంచారు. ఆ యాంకర్ ఎవరో కాదు కపిల్ శర్మ. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ది కపిల్‌శర్మ షో’కు అజయ్, టబుతోపాటు శ్రియ అతిథులుగా హాజరయ్యారు. తమ కొత్త చిత్రం ‘దృశ్యం 2’ (Drishyam 2) గురించి పలు విశేషాలు పంచుకున్నారు. సంబంధిత ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
అందులోని దృశ్యాలివీ.. ఓ పాటను ఆలపిస్తూ టబుని కార్యక్రమానికి ఆహ్వానించిన కపిల్.. అజయ్ వస్తుంటే దూరంగా వెళతారు. తర్వాత, ఈ ఇద్దరు తమ తమ పెళ్లి రోజు గుర్తుందో లేదోనని ఒకరికొకరు పరీక్ష పెట్టుకుంటారు. ‘‘డిసెంబరు 12న అమృత్‌సర్‌లో ఏం జరిగింది?’’ అని అజయ్ ప్రశ్నించగా ‘అన్ని రోజుల్లానే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి గడిచాయి’ అని కపిల్ సరదాగా చెప్పారు. ‘‘ఫిబ్రవరి 24న ఏం జరిగింది?’’ అని కపిల్ అడగ్గా ‘డిసెంబరు 12న ఏమైందో ఫిబ్రవరి 24న అదే జరిగింది’ అని అజయ్ సమాధానమివ్వడంతో షోలో సందడి నెలకొంది. అనంతరం, టబు కళ్ల ప్రస్తావన వచ్చింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా తెరకెక్కిన అజయ్ ‘దృశ్యం 2’ ఈ నెల 18న విడుదలకానుంది. అభిషేక్ పాఠక్ దర్శకుడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్