Ajay Ghosh: ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ అందరిలో స్ఫూర్తి నింపుతుంది: అజయ్‌ ఘోష్‌

అజయ్‌ ఘోష్‌ ప్రధానపాత్రలో నటించిన  ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy) జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

Published : 13 Jun 2024 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్విహించారు.అజయ్‌ ఘోష్‌ (Ajay Ghosh) మాట్లాడుతూ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని.. ఒకవేళ నచ్చకపోతే తనకు ఫోన్ చేసి తిట్టొచ్చని ఫోన్‌ నంబర్‌ చెప్పారు.

‘నిర్మాతలు చాలా ప్రోత్సహించారు. ఆడియన్స్‌ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. ఇది చూశాక కొందరు ఆనందపడతారు. కొందరు ఇలా ఎందుకు కాలేకపోయామని బాధపడతారు. ఎంతోమంది జీవితానికి అద్దంపడుతుందీ చిత్రం. జీవితంలో ఏదైనా సాధించాలి.. ఉన్నత స్థానాలకు వెళ్లాలనుకునే వాళ్లలో ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy) స్ఫూర్తి నింపుతుంది. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించొచ్చు అనిపిస్తుంది. మనం విజయం సాధించడమనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. మంచి వాళ్లతో స్నేహం చేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తాం. సినిమాల్లో నటించాలని ఒక జత దుస్తులతో ఇంటి నుంచి వచ్చేశాను. మంచి వాళ్లు తోడైయ్యారు కాబట్టి గుర్తింపు వచ్చింది. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ కుటుంబమంతా కూర్చుని చూసే సినిమా. మంచి కథతో తెరకెక్కించారు. వందల కోట్లు పెట్టి తీసే సినిమాలతో పాటు కంటెంట్‌ ఉన్న చిత్రాలను కూడా ఆదరించే గొప్ప సంస్కారవంతులు ప్రేక్షకులు. ఇలాంటి సినిమాలను వాళ్లు కచ్చితంగా ఆదరిస్తారు. చాందినీ చౌదరి గొప్ప నటి. ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని