Cobra: ‘కోబ్రా’పై విమర్శలు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

చియాన్‌ విక్రమ్‌ (Vikram) ప్రధాన పాత్రలో నటించిన ‘కోబ్రా’ (Cobra)పై పలువురు సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదురవుతోన్న సంగతి తెలిసిందే.....

Published : 05 Sep 2022 13:25 IST

చెన్నై: చియాన్‌ విక్రమ్‌ (Vikram) ప్రధాన పాత్రలో నటించిన ‘కోబ్రా’ (Cobra)పై పలువురి నుంచి విమర్శలు ఎదురవుతోన్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్‌ బాలేదని, నిడివి ఎక్కువగా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా చిత్ర దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు స్పందిస్తూ వారికి క్షమాపణలు చెప్పారు.

తాజాగా ఇన్‌స్టా వేదికగా ఈ సినమా గురించి ఆయన నెటిజన్లతో ముచ్చటించారు. ‘‘కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్‌ నిరాశాజనకంగా ఉంది’’ అని ఓ నెటిజన్‌ అనగా.. ‘‘పోలీసుల నుంచి హీరో తప్పించుకొని విదేశాల్లో స్వేచ్ఛగా బతుకుతున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా?’’ అని అజయ్‌ సమాధానమిచ్చారు.

‘‘స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉంది’’ అని మరో నెటిజన్‌ విమర్శించగా.. ‘‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు సారీ. ప్రతీ క్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమాలు చూడటం ఒక ప్రేక్షకుడిగా నేనిష్టపడతాను. అదేవిధంగా ‘కోబ్రా’ని తెరకెక్కించా. సాధ్యమైతే మరోసారి మా చిత్రాన్ని వీక్షించండి. తప్పకుండా మీకు నచ్చుతుంది’’ అంటూ దర్శకుడు చెప్పారు. ‘‘కోబ్రా’ అంత నిడివితో ఎందుకు విడుదల చేశారు?’’ అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా..  ‘‘సినిమాలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాలనుకున్నాం. అందుకే మొదటిరోజు మూడు గంటల నిడివితో చిత్రాన్ని విడుదల చేశాం. పలువురు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వల్ల నిడివి  తగ్గించాం. నిడివిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అర్థమైంది. తదుపరి చిత్రాల నుంచి ఈ తప్పు జరగకుండా చూసుకుంటా’’ అని ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని