Rudra: ‘రుద్ర’ ట్రైలర్‌ వచ్చేసింది..!

‘సింగం’ తర్వాత మరోసారి పోలీస్‌ లుక్‌లో అలరించనున్నారు బాలీవుడ్‌ స్టార్‌హీరో అజయ్‌దేవ్‌గణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్ర’. రాజేశ్‌ మపుస్కర్‌...

Published : 30 Jan 2022 13:55 IST

ముంబయి: ‘సింగం’ తర్వాత మరోసారి పోలీస్‌ లుక్‌లో అలరించనున్నారు బాలీవుడ్‌ స్టార్‌హీరో అజయ్‌దేవ్‌గణ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్ర’. రాజేశ్‌ మపుస్కర్‌ దర్శకుడు. ఇప్పటి వరకూ వెండితెరపై అలరించిన అజయ్‌దేవ్‌గణ్‌ ఈ చిత్రంతో ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో ‘రుద్ర’ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ‘రుద్ర’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. బ్రిటిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా చేసుకొని ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపొందించారు. ముంబయి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్‌ని హీరో ఎలా పట్టుకోగలిగాడు? అనే అంశంతో ఈసినిమా సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఇందులో నటి రాశీఖన్నా కీలకపాత్ర పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని