Ajith Kumar: ‘ఏకే 62’ ఖరారు.. దర్శకుడెవరంటే?

‘వలిమై’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్‌ కుమార్‌ తదుపరి చిత్రాన్ని ఖరారు చేశారు.

Published : 18 Mar 2022 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వలిమై’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్‌ కుమార్‌ తదుపరి చిత్రాన్ని ఖరారు చేశారు. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అజిత్‌తో సినిమా నిర్మిస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సుభాస్కరన్‌ ఓ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ఏడాది చివరిలో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇతర తారాగణం, సాంకేతిక బృంద వివరాలు, టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అజిత్‌కి ఇది 62వ సినిమా. ‘ఏకే 62’ అనేది వర్కింగ్‌ టైటిల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని