Ajith Kumar: హీరో అజిత్‌ ఇంట విషాదం

కోలీవుడ్‌ ప్రముఖ హీరో అజిత్‌ (Ajith) ఇంట విషాదం చోటుచేసుకుంది.

Updated : 24 Mar 2023 10:58 IST

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ హీరో అజిత్‌ (Ajith) ఇంట విషాదం చోటుచేసుకుంది. అజిత్‌ తండ్రి పి.సుబ్రమణియం (84) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. బెసెంట్‌ నగర్‌లోని శ్మశానవాటికలో సుబ్రమణియం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని