Ajith: ఆ తమిళ సినిమాకు తెలుగు టైటిల్‌ ఇదే...!

స్టార్‌ హీరో అజిత్‌(Ajith) నటిస్తోన్న తాజా చిత్రం తునివు(Thunivu). ఈ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Published : 08 Dec 2022 14:13 IST

హైదరాబాద్‌: కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న నటుడు అజిత్(Ajith)‌. ఇటీవల వలిమై చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. అయితే ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయడం వల్ల ఈ భాషలో సరిగ్గా మెప్పించలేకపోయింది. తాజాగా తునివు(Thunivu) చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో కాకుండా టైటిల్‌ మార్చి విడుదల చేయనున్నారట. తెలుగులో ఈ చిత్రాన్ని ‘తెగింపు’ పేరుతో రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మంజు వారియర్ కథానాయిక.  రానున్న సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాల సరసన ఈ చిత్రం విడుదలవ్వనుంది. ఇప్పటికే విజయ్‌ వారిసు సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని