Thunivu: అజిత్- వినోద్ కాంబో వరుసగా మూడోసారి.. ‘తెగింపు’ వివరాలివి!
అజిత్ హీరోగా దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘తునివు’ (తెలుగులో తెగింపు). ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డబ్బింగ్ చిత్రం ‘తెగింపు’ (Tegimpu). ‘తునివు’ (Thunivu) పేరుతో రూపొందిన ఈ తమిళ సినిమా జనవరి 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..
📽️ అజిత్ (Ajith) నటించిన 61వ చిత్రమిది. దర్శకుడు హెచ్. వినోద్ (H Vinod)కు 5వ సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రాల్లో దీని సంఖ్య 3. అంతకు ముందు ఈ కాంబోలో ‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి వరుసగా మూడు సినిమాలకు పనిచేయడం విశేషం.
📽️ జాతీయ అవార్డు గ్రహీత మలయాళీ నటి మంజు వారియర్ (Manju Warrier) ‘అసురన్’ తర్వాత నటించిన తమిళ సినిమా ఇదే.
📽️ ఇదొక విభిన్న తరహా క్రైమ్ కథ. బ్యాంకు దోపిడీ ఇతివృత్తంగా రూపొందింది. సముద్రఖని, వీర, భగవతి పెరుమాళ్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
📽️ ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బ్యాంకాక్‌లో జరిగింది.
📽️ ఓ ఫైట్ సీక్వెన్స్ అనుకున్నంత పర్ఫెక్ట్గా వచ్చేందుకు అజిత్ 13 టేక్స్ తీసుకున్నారట. ఈ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని స్టైలిష్ లుక్‌లో అజిత్ నటించారు.
📽️ ఈ చిత్రంలో మూడు పాటలుండగా ‘చిల్లా చిల్లా’కు విశేష స్పందన లభించింది.
📽️ 2022 డిసెంబరు 31న విడుదలైన ఈ సినిమా తమిళ ట్రైలర్ 24 గంటల్లోనే 25 మిలియన్ (2 కోట్ల 50 లక్షలు) వ్యూస్ సొంతం చేసుకుంది. ఆదివారానికి ఆ సంఖ్య 57 మిలియన్ (5 కోట్ల 70 లక్షలు)కు చేరింది. జనవరి 2న విడుదలైన తెలుగు ట్రైలర్‌కు 17 లక్షల వీక్షణలు దక్కాయి.
📽️ దాదాపు రూ. 140 కోట్లతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. రన్‌టైమ్ 145 నిమిషాలు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి
-
Politics News
Nitish Kumar: కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!