Cinema News: ఆకాశ్‌ పూరీ కొత్త సినిమా టైటిల్‌ ఇదే..!

పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు ఆకాశ్‌ పూరీ. ఆయన కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి....

Published : 25 Jul 2021 13:26 IST

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు ఆకాశ్‌ పూరీ. ఆయన కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘చోర్‌బజార్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆదివారం ఆకాశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా మోషన్‌పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఆకాశ్‌ మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.

పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన ఆకాశ్‌పూరీ ‘గబ్బర్‌సింగ్‌’, ‘ధోనీ 2021’లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆకాశ్‌ ‘ఆంధ్రాపోరి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంతస్థాయి విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘మెహబూబా’ మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన ‘రొమాంటిక్‌’, ‘చోర్‌ బజార్‌’ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని