Akash Puri: ప్రతిభ ఉంటేనే స్టార్స్‌ అవుతారు

‘‘స్టార్‌ కిడ్స్‌ అంటే రాగానే స్టార్స్‌ అయిపోరు. వాళ్లలో ప్రతిభ ఉంటేనే అవుతారు. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా’’ అన్నారు ఆకాష్‌ పూరి.

Updated : 24 Jun 2022 08:01 IST

‘‘స్టార్‌ కిడ్స్‌ అంటే రాగానే స్టార్స్‌ అయిపోరు. వాళ్లలో ప్రతిభ ఉంటేనే అవుతారు. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా’’ అన్నారు ఆకాష్‌ పూరి (Akash Puri). ఆయన హీరోగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’ (Chor Bazaar). వీఎస్‌.రాజు నిర్మించారు. గెహనా సిప్పీ (Gehnna Sippy) నాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో విష్వక్‌ సేన్‌, నిర్మాత బండ్ల గణేష్‌, దర్శకుడు పరశురామ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh) మాట్లాడుతూ.. ‘‘పూరి జగన్నాథ్‌ ఎంతోమందిని స్టార్స్‌ చేశాడు. కానీ, సొంత కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాకుండా ఎక్కడో ముంబయిలో ఉన్నాడు. ‘చోర్‌ బజార్‌’లో నీ కొడుకు అదరగొట్టాడు. నువ్వు చేసినా.. చేయకున్నా నీ కొడుకు స్టార్‌ అవుతాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య, సుబ్బరాజు, అర్చన, బీవీఎస్‌ రవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని