Akhanda: బాలయ్య జోరు.. దసరాకే ఖరారు?

దసరాకి బాలయ్య సందడి చేయనున్నారా? ఆయన జోరు చూస్తుంటే ఖాయమనే అనిపిస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ కొన్నాళ్లుగా ...

Updated : 17 Oct 2022 14:17 IST

సరాకి బాలయ్య సందడి చేయనున్నారా? ఆయన జోరు చూస్తుంటే ఖాయమనే అనిపిస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. సోమవారం వరకు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే ‘అఖండ’ సందడి దసరాకి ఖాయమనే అర్థమవుతోంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని