Balakrishna: ఆనందంలో బాలయ్య.. ఫొటోలు చూశారా..!

మాస్‌ ఎలివేషన్స్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లు.. వీటన్నింటినీ మించి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మాస్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అఖండ’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన....

Published : 12 Mar 2022 11:05 IST

హైదరాబాద్‌: మాస్‌ ఎలివేషన్స్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లు.. వీటన్నింటినీ మించి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మాస్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అఖండ’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 7న విడుదలై.. బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారంతో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా ‘అఖండ’ టీమ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొంది. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, తదితరులు బాలయ్యని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ‘అఖండ’ షూట్‌ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘సింహా’ ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సూపర్‌హిట్‌ కావడంతో బాలయ్య-బోయపాటి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వేడుకలకు ‘NBK 107’ సెట్‌ వేదికైంది. మరోవైపు శతదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నేడు కర్నూలులో అభినందన సభ నిర్వహించనున్నారు. ‘అఖండ’ అనంతరం బాలయ్య.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకున్న తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ప్రస్తుతం NBK 107 అనే పేరుతో ప్రచారంలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని