Agent ott release: అఖిల్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ వాయిదా.. స్పందించిన ఓటీటీ సంస్థ!
Agent ott release: అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదల వాయిదా పడింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం సోనీలివ్ సామాజిక మాధ్యమాలను అనుసరించాలని సదరు ఓటీటీ సంస్థ తెలిపింది.
హైదరాబాద్: అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో మూడు వారాలకే సినిమాను ఓటీటీ విడుదల చేస్తున్నట్లు స్ట్రీమింగ్ వేదిక సోనీలివ్ తెలిపింది. మే 19వ తేదీ (Agent ott release) నుంచి ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, సినిమా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఓటీటీలో సినిమా చూద్దామనుకునే వారు నిరాశకు గురయ్యారు.
ఇదే విషయమై సామాజిక మాధ్యమాల వేదికగా సోనీలివ్‌ను ప్రశ్నించగా, ‘ప్రస్తుతం సినిమా అందుబాటులో లేదు. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌ల కోసం దయ చేసి మా సోషల్‌మీడియా వేదికలను అనుసరించండి’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏజెంట్ పోస్టర్‌లను పంచుకుంటూ ‘‘అఖిల్, మమ్ముటి నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రైడ్ ‘ఏజెంట్’ త్వరలోనే స్ట్రీమింగ్ అవుతుంది’’ అని పేర్కొంది. అయితే, ఎప్పుడు, ఏ సమయానికి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తారో మాత్రం చెప్పలేదు. తొలుత మే 19న విడుదల చేస్తామని అధికారికంగా ప్రటించినా, మూడు వారాలకే ఓటీటీలో రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోవారం రోజులు ఆగినట్లు తెలుస్తోంది. మే 26న స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఏజెంట్ రివ్యూ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఆదేశం
-
Seethakka: నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు: హైకోర్టులో సీతక్క పిటిషన్
-
Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
-
Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించిందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం