Akshay kumar: వెండితెరపై ఛత్రపతి వీరత్వం
హిందీ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ఛత్రపతి శివాజీగా వీరత్వాన్ని ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. మరాఠీ చిత్రం ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’లో శివాజీగా నటిస్తున్నారు.
హిందీ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ (Akshay Kumar) ఛత్రపతి శివాజీగా వీరత్వాన్ని ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. మరాఠీ చిత్రం ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’లో (Vedat Marathe Veer Daudale Sat) శివాజీగా నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా శివాజీ పాత్రని తన కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు అక్షయ్. ‘ఈరోజే చిత్ర షూటింగ్ మొదలైంది. ఇందులో నేను ఛత్రపతి శివాజీ మహరాజ్‌గా కనిపిస్తాను. ఈ అవకాశం రావడం నా అదృష్టం, గౌరవంగా భావిస్తున్నా. ఆయన జీవితం అందించిన స్ఫూర్తితో, తల్లి జిజియాబాయి ఆశీస్సులతో నా శక్తిమేర అత్యుత్తమంగా నటించడానికి ప్రయత్నిస్తా’ అన్నారు. పాత్రకి సంబంధించిన గెటప్‌ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!