Sukumar: సుకుమార్‌ని ‘ఛాన్స్‌’ అడిగిన బాలీవుడ్‌ హీరో!

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బన్నీ, సుకుమార్‌కు అక్కడ క్రేజ్‌ విపరీతంగా

Published : 16 Jan 2022 03:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బన్నీ, సుకుమార్‌కు అక్కడ క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్‌ నటనను, సుక్కు దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అయితే, ఏకంగా తనతో ఓ సినిమా చేయాలని కోరడట. ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే వెల్లడించారు.

ఇటీవల అక్షయ్‌కుమార్‌ ‘పుష్ప’ చిత్రం చూశారు. సినిమా తనకు బాగా నచ్చడంతో అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ఆ తర్వాత అక్షయ్‌ స్వయంగా సుకుమార్‌కి ఫోన్‌ చేసి మెచ్చుకున్నారట. అంతేకాదు, తనతో ఒక సినిమా చేయాలని కోరినట్లు సుకుమార్‌ తెలిపారు. అక్షయ్‌తో మాట్లాడటం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని సుకుమార్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని