
Akshay Kumar: ‘పృథ్వీరాజ్’ కోసం 50,000 కాస్ట్యూమ్స్ ...!
ఇంటర్నెట్ డెస్క్: అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. సోన్‌సూద్, సంజయ్‌దత్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో మానుషి ఛిల్లర్ కథానాయిక. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం ఏకంగా 50,000 రకాల కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. 500 రకాల తలపాగాలను తయారు చేయించారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన చిత్రబృందం ఈ వార్త నిజమేనని తెలిపింది.
దీనిపై హీరో అక్షయ కుమార్ మాట్లాడుతూ. ‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా గౌరవంగా , చిత్తశుద్ధితో రూపొందిస్తున్నాము. ఈ సినిమా తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా అనిపిస్తుంది’ అని చెప్పారు. ఇక ఆ సినిమా దర్శకుడు చంద్రప్రకాశ్ మాట్లాడుతూ..‘ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రం కోసం 500 రకాల తలపాగాలు తయారు చేయించాము. వీటిని చేతితో తయారు చేశారు. ఆ కాలంలోని రాజులు, ప్రజలు,వివిధ వృత్తుల వారు ధరించే తలపాగాలను పోలి ఉంటాయి. మేము వీటిని తయారు చేయించడం కోసం తలపాగాలు తయారు చేసే నిపుణుడిని సెట్‌లో మాతో ఉండేట్టు చూసుకున్నాము’ అని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్ ట్వీట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం