అక్షయ్‌ ‘ఫౌజీ’గీతం..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నుంచి త్వరలో ఓ మల్టీప్లేయర్‌ వీడియోగేమ్‌ రానుంది. ఆర్మీ నేపధ్యంలో ఉండే ఈ గేమ్‌ పేరు ఫౌజీ(FAU-G).తాజాగా ఆ గేమ్‌కు సంబంధించి ఒక పరిచయ గీతాన్ని(ఏంథమ్‌) ఆయన ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు.

Published : 04 Jan 2021 10:34 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నుంచి త్వరలో ఓ మల్టీప్లేయర్‌ వీడియోగేమ్‌ రానుంది. ఆర్మీ నేపథ్యంలో ఉండే ఈ గేమ్‌ పేరు ఫౌజీ (FAU-G). తాజాగా ఆ గేమ్‌కు సంబంధించి ఒక పరిచయ గీతాన్ని ఆయన ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు. యానిమేషన్‌ పోరాటాల మధ్య బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ గీతం వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో ‘సమస్య అనేది దేశంలో ఉన్నా, సరిహద్దుల్లో ఉన్నా..  మన భారత వీరసైనికులు ముందుండి పోరాడుతున్నారు. బెరుకు లేకుండా సమష్టిగా యద్ధం చేస్తున్నారు. వారి ధైర్యసాహసాలకు నిదర్శనమే ఈ గీతం’ అంటూ  రాసుకొచ్చారు. జనవరి 26న ఈ యానిమేషన్‌ వీడియోగేమ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
 Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని