Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ఓ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. తన సినిమాలతో అటు నార్త్‌లోనే కాకుండా ఇటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడీ హీరోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన పని భారతీయులను కించపరిచేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. అక్షయ్ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్ చేస్తూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఉత్తర అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ‘ది ఎంటర్‌టైనర్స్’ వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరంతా సీట్ బెల్టు పెట్టుకొని ఉండండి. మేము మార్చిలో మీ ముందుకు వస్తున్నాం’’ అనే క్యాప్షన్‌ను రాశారు. ఈ వీడియోలో అక్షయ్‌తో పాటు దిశా పటానీ(Disha Patani), నోరా ఫతేహీ(Nora Fatehi), మౌనీరాయ్ తదితరులు ఉన్నారు. వారంతా షూ వేసుకుని గ్లోబ్‌పై నడుస్తూ ఉన్న ఈ ప్రమోషనల్ వీడియోపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అక్షయ్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘భాయ్ ఇలా షూ వేసుకుని మనదేశ మ్యాప్‌పై నడవడానికి సిగ్గుగా అనిపించడం లేదా’ అని ఒకరు అంటే.. ‘దేశాన్ని కాస్తయినా గౌరవించండి’ అని మరొకరు అన్నారు. ‘మీరు చేసిన పనికి భారతీయులందరికీ క్షమాపణలు చెప్పండి’ అంటూ మరో నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రామ్ సేతు(Ram Sethu)లో కనిపించిన ఈ హీరో ప్రస్తుతం ‘సెల్ఫీ’(Selfie), ‘ఓ మై గాడ్2’(OMG2) తో పాటు మరో నాలుగు సినిమాల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్