Published : 27 May 2022 19:28 IST

Samrat Prithviraj: అక్షయ్‌ కుమార్‌ ‘పృధ్వీరాజ్‌’ సినిమా పేరు మార్పు

ఇంటర్నెట్‌ డెస్క్: అక్షయ్‌ కుమార్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘పృధ్వీరాజ్‌’. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో రానున్న పీరియాడికల్‌ డ్రామాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా మిస్‌ యూనివర్స్‌-2017 విజేత మానుషి చిల్లర్‌ నటిస్తున్నారు. జూన్‌3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పేరును మారుస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పృధ్వీరాజ్‌’ సినిమా పేరును ‘సామ్రాట్‌ పృధ్వీరాజ్‌’గా మారుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిల్లీని పరిపాలించిన పృధ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళభాషల్లో విడుదల కానుంది. సంజయ్‌దత్‌, సోనూసూద్‌ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని