‘అలవైకుంఠపురములో’ ఏడాది సంబరాలు
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అలవైకుంఠపురములో’ ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. చిత్రబృందం.. ఏడాది సంబురాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు,
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అలవైకుంఠపురములో’ ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. చిత్రబృందం.. ఏడాది సంబురాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చిత్రబృందం మొత్తం పాల్గొని సందడి చేసింది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విజయవంతం కావడానికి ముఖ్యకారణం త్రివిక్రమ్‌గారు. ఈ సినిమాకు ఆయన పెన్ను వాడలేదు.. ఎక్కువగా పెన్సిల్ వాడారు. అంటే రాస్తూరాస్తూ.. ఉండిపోయారు. అంతలా కష్టపడ్డారాయన. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. బన్నీ గురించి చెప్పాలంటే.. నాకు కెరీర్లో ఆయనతో చేసిన రేసు గుర్రం ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకు నేను చేసిన ఆల్బమ్ కరోనా సమయంలో ఎంతో అలరించింది. నేను నా కొత్త సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్లడం లేదు. కానీ.. ఈ కార్యక్రమానికి వచ్చానంటే ఈ సినిమా నాకెంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. నా ప్రేమ.. నా ఎమోషన్ అంతా సంగీతమే’’ అని అంటూ తమన్ భావోద్వేగానికి గురయ్యారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘రెండు సంవత్సరాల క్రితం నేను, బన్నీ బ్లాక్ కాఫీ తాగుతూ.. సినిమా చేయాలనుకున్నాం. అలా మొదలైన ఈ సినిమా ప్రయాణం ఇప్పటివరకూ వచ్చింది. ఈ సినిమాకు బన్నీ ఎంతలా కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. ఒక నటుడిలా కాకుండా.. టెక్నీషియన్‌లా మాతోపాటే పనిచేశారాయన. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం అద్భుతం. ఈ సినిమాలో సామజవరగమన.. ‘రాములో రాముల’ ఒక వండర్. సినిమాను థియేటర్లో ప్రేక్షకులు ఎంతలా ఆస్వాదించారో.. మేం షూటింగ్‌ను అంతే ఎంజాయ్ చేశాం’’ అని ఆయన ముగించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ..‘ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. 2020 ఎంతో మందికి చేదుజ్ఞాపకం కానీ.. నాకు మాత్రం తీపిజ్ఞాపకాన్నిచ్చిన ఏడాది. ఈ సినిమా వల్ల లాక్‌డౌన్‌లోనూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. నాకు మంచి మైలురాయి రావడానికి 20 సినిమాలు పట్టింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యావాదాలు. ఈ సినిమా ఎంత పెద్దవిజయం సాధించినా అందరికంటే మంచి పేరు వచ్చింది నాకే. తమన్ ఒక్క పాట కాదు.. అల్బమ్ మొత్తం అద్భుతంగా ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటున్నాను. త్రివిక్రమ్ కేవలం నాకు డైరెక్టర్ మాత్రమే కాదు నాకు పెద్దన్నలాంటి వారు. సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని బన్నీ పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఇవీ చదవండి..
సామ్‌జామ్.. ఈ ఫన్నీ వీడియోను మిస్‌కావొద్దు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు