Bollywood: ఒక్కోసారి స్వార్థంగా ఉండడంలోనూ తప్పులేదు..: బాలీవుడ్‌ నటి

సోషల్‌మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ ఆల్యా ఎఫ్‌ (Alaya F). ఆమె నటించిన తాజా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది.  

Published : 01 Feb 2023 14:07 IST

హైదరాబాద్‌: యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ బ్యూటీ ఆల్యా ఎఫ్‌ (Alaya F). ఈ హీరోయిన్‌ ఇండస్ట్రీకి పరిచయమై మూడేళ్లు అయింది. ఇక ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం త్వరలోనే విడుదలవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది.

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యాను. అక్కడ వేదికపై ఓ వ్యక్తి నేను చేసిన సినిమాల గురించి చెప్పమని అడిగారు. మనం చేసే పని గురించి చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని  అప్పుడు అర్థమైంది. నేను తీసుకునే నిర్ణయాలు నాపై, నా కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి స్వార్థంగా ఉండడంలోనూ తప్పు లేదని భావిస్తాను’’ అని తెలిపింది. ఇక ఆల్యా నటించిన తాజా చిత్రం ‘ఆల్మోస్ట్ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్’‌(Almost Pyaar With DJ Mohabbat) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనురాగ్‌ కశ్యప్‌(Anurag Kashyap) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు