Alaya F: తల్లి.. తాతతో కలిసి అలయ
‘జవానీ జానేమన్’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసి, సైఫ్ అలీ ఖాన్, టబులతో కలిసి నటించి అభిమానులను సొంతం చేసుకుంది అలయ ఎఫ్.
‘జవానీ జానేమన్’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసి, సైఫ్ అలీ ఖాన్, టబులతో కలిసి నటించి అభిమానులను సొంతం చేసుకుంది అలయ ఎఫ్. ఇప్పుడు తన తాతయ్య, బాలీవుడ్ నటుడు కబీర్ బేడి, తల్లి పూజా బేడితో కలిసి సందడి చేయనుంది. సినిమాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోను చురుగ్గా ఉంటూ అభిమానులకు దగ్గరైంది. ఇటీవలే ఆమె పెట్టిన ఓ పోస్టులో తాతయ్య, తల్లితో ఓ టెలివిజన్ షోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపింది. ‘మొదటిసారి మూడు తరాలు కలిసి అలరించనున్నాము’ అంటూ జోడించింది.
2019 తన సినీజీవితాన్ని ప్రారంభించిన అలయ ఎఫ్ ‘ఫ్రెడ్డి’ చిత్రంలో నటించి మెప్పించింది. అనురాగ్ కశ్యప్ తీసిన ‘ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ అనే ప్రేమకథ సినిమాలో అలరించింది. రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి ‘శ్రీ’లో నటించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: గచ్చిబౌలిలో రూ.25.5 లక్షలు పలికిన గణపయ్య లడ్డూ
-
Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్
-
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్.. 5జీ స్మార్ట్‌ఫోన్ కంటే ఎక్కువే!
-
Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం
-
Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
-
PM Modi: నాకు సొంతిల్లు లేదు.. కానీ: ప్రధాని మోదీ