NTR 30: ‘ఎన్టీఆర్‌ 30’లో అలియాభట్‌.. నటి ఏమందంటే?

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది.

Updated : 04 Feb 2022 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ కథానాయికగా ఎంపికైందంటూ ఇటీవలి నుంచి ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అలియా స్పష్టతనిచ్చింది. తాను నటించిన హిందీ చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ ప్రెస్‌మీట్‌లో సమాధానమిచ్చింది. ‘‘ఎన్టీఆర్‌ 30’కి సంబంధించి ఇప్పుడేం చెప్పలేను. కొరటాల శివ కథ చెప్పారు. నచ్చింది. ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటించటం ఆనందంగా ఉంది. తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేయాలనుంది’’ అని తెలిపింది.

నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కొరటాల శివ శైలి, సామాజిక అంశాలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభంకానుంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అలియా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25న విడుదలకానుంది. ఈ సినిమాతోనే అలియా టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయంకాబోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని