Alpha: ‘ఆల్ఫా’ అమ్మాయిల రాకకు వేళాయే!

‘రాజీ’లో దేశం కోసం సాహసాలు చేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది అందాల తార అలియా భట్‌. ఇప్పుడామె మరోసారి వైఆర్‌ఎఫ్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Published : 06 Jul 2024 01:29 IST

‘రాజీ’లో దేశం కోసం సాహసాలు చేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది అందాల తార అలియా భట్‌. ఇప్పుడామె మరోసారి వైఆర్‌ఎఫ్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అలియా, శార్వరీ వాఘ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బాక్సాఫీసును షేక్‌ చేసే చిత్రాల్ని రూపొందించిన ఈ నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా దీనికి ‘ఆల్ఫా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది అలియా. ‘‘గ్రీకు భాషలోని మొదటి అక్షరం..మా నినాదం.. ‘ఆల్ఫా’. ఇది అత్యంత వేగమైనది, శక్తిమంతమైనది. ప్రతి దేశం ఒక అరణ్యం లాంటిదే. దాన్ని పాలించడానికే వస్తోంది. ‘ఆల్ఫా’ గర్ల్స్‌ వచ్చే సమయం ఆసన్నమైంద’’ని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంలో మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. అనిల్‌ కపూర్, బాబీ దేవోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో ప్రారంభమైనట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని