Alia Bhatt: వ్యాపారంలోనూ అదరగొడుతున్న అలియా.. ₹150 కోట్లకు కంపెనీ విలువ!

సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు బాలీవుడ్‌ నటి అలియా భట్‌. తన ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ప్రారంభించిన దుస్తుల కంపెనీ విలువ ఏడాదిలోనే రూ.150కోట్లను క్రాస్‌ చేసిందట!

Published : 15 Mar 2023 22:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలియా భట్‌ (Alia Bhatt)..  ఈ తరానికి పరిచయం అవసరం లేని పేరు. గ్లామర్‌ పాత్రలతోపాటు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్న తార. అలియా కేవలం నటి మాత్రమే కాదండోయ్‌. . విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. సినీ రంగంలోనే కాదు.. వ్యాపార రంగంలోనూ తనదైన స్టైల్‌తో అదరగొడుతూ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ బాలీవుడ్‌ అందం.. బుధవారం 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా వ్యాపార రంగంలో ఆలియా సాధించిన విజయాన్ని ఓసారి గమనిస్తే.. 

చిన్నతనంలోనే తెరపై హీరో రణ్‌బీర్‌ను చూసి ఇష్టపడి అతడినే పెళ్లి చేసుకోవాలన్న తన కలను నిజం చేసుకున్న అలియా భట్‌.. వ్యాపార రంగంలోనూ అంతే పట్టుదలతో దూసుకెళ్లింది. ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న పిల్లల బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి లాభాల బాటలో పయనించింది. కొన్నాళ్లపాటు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఆమె.. తొలిసారి 2022లో తాను గర్భిణిగా ఉన్న సమయంలోనే చిన్నారుల కోసం ఎడ్‌ - ఎ - మామా పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టింది. ఏడాదిలోనే కంపెనీ విలువ రూ.150 కోట్ల మార్కును దాటడం విశేషం.

కేవలం 12 నెలల్లో ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధిని సాధించి. రెండు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల దుస్తులను విక్రయించే ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 800 వరకు వస్తువులు అందుబాటులో ఉన్నాయి. గతంలో అగరబత్తులు, నూనెలు తయారు చేసే కంపెనీలతో పాటు నైకా, ఫూల్‌.కో, స్టైల్‌క్రాకర్‌ వంటి సంస్థల్లో అలియా పెట్టుబడులు పెట్టింది. వ్యాపారం గురించి తాను ఇంకా నేర్చుకుంటున్నానని చెప్పే అలియా... తన బిజినెస్‌ క్రెడిట్‌ తన కంపెనీకే చెందుతుందని చెప్పింది. 

అలియా భట్‌ నికర ఆస్తుల విలువ రూ.229 కోట్లు అని సమాచారం. ఆమె సినిమాల్లో ఒక్కో పాత్రకు సుమారు రూ.20 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అలియాకు బీఎండబ్ల్యూ 7తో పాటు ఆడి ఏ6, ఆడి క్యూ7, రేంజ్‌ రోవర్‌ వోగ్‌ వంటి  ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని