Alia Bhatt: కాపురంలో కలతలెందుకు?

అలియా భట్‌ ప్రధాన పాత్రధారిగా ‘రెడ్‌ చిల్లీస్‌’ పతాకంపై తెరకెక్కుతున్న కామెడీ-డ్రామా చిత్రం ‘డార్లింగ్స్‌’. జస్మీత్‌ కె రీన్‌ దర్శకురాలు. గౌరీఖాన్‌, అలియా భట్‌, గౌరవ్‌వర్మలు నిర్మిస్తున్నారు. షెఫాలీ షా, విజయ్‌వర్మ, రోషన్‌ మ్యాథ్యూ.. కీలక పాత్రల్లో నటించారు.

Updated : 06 Jul 2022 12:08 IST

లియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రధారిగా ‘రెడ్‌ చిల్లీస్‌’ పతాకంపై తెరకెక్కుతున్న కామెడీ-డ్రామా చిత్రం ‘డార్లింగ్స్‌’ (Darlings). జస్మీత్‌ కె రీన్‌ దర్శకురాలు. గౌరీఖాన్‌, అలియా భట్‌, గౌరవ్‌వర్మలు నిర్మిస్తున్నారు. షెఫాలీ షా, విజయ్‌వర్మ, రోషన్‌ మ్యాథ్యూ.. కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో విజయ్‌.. అలియా వెంట పడటంతో ట్రైలర్‌  మొదలవుతుంది. అష్టకష్టాలు పడి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వీరి మధ్య మూడో వ్యక్తి రోషన్‌ ప్రవేశించడంతో వాళ్ల కాపురంలో కలతలు, అనుమానాలు మొదలవుతాయి. ఈ చిక్కుముళ్ల నుంచి బయట పడటానికి అలియా తన తల్లి షెఫాలీతో కలిసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరగడం.. కప్ప, తేలు కథ చెప్పడం.. ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో అలియా డీ-గ్లామర్‌గా అవతారంలో కనిపిస్తోంది. ‘ఇది కేవలం టీజరే. అసలు కథ ఆగస్టు 5న ఉంటుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంగీతం విశాల్‌ భరద్వాజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని