Alia Bhatt: ఆ విషయంలో బాధపడటం లేదు: అలియా భట్‌

గతేడాది అలియాభట్‌కు ఎంతో సంతోషంగా గడిచింది. వర్క్‌ పరంగా చూసుకుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూబాయి కాఠియావాడి’ వంటి హిట్స్‌ అందుకుంది ఈ భామ.

Published : 02 Jan 2023 10:24 IST

ముంబయి: బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా రాణిస్తోన్న తరుణంలో తల్లినైనందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని నటి అలియాభట్‌ (Alia Bhatt) అన్నారు. జీవితంలో తాను ఇప్పటివరకూ తీసుకున్న గొప్ప నిర్ణయం రాహకు (అలియా కుమార్తె) జన్మనివ్వడమేనని చెప్పారు. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘జీవితంలో తప్పు, ఒప్పు అనేది ఏమీ ఉండదు. నాకు నచ్చేది వేరే వాళ్లకు నచ్చకపోవచ్చు. సినిమా పరంగా అయినా, లేదా ఏ విషయంలోనైనా ఎప్పటికీ నా మనసు మాటే వింటాను. కెరీర్‌ పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పుడు రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకుని పాపకు జన్మనిచ్చాను. పెళ్లి, మాతృత్వం అనేది నా వర్క్‌ లైఫ్‌ను మారుస్తాయని ఎవరు చెప్పారు? ఒకవేళ మార్పు వస్తే రానివ్వండి. దానిని నేను పెద్దగా పట్టించుకోను. పని దొరకలేదని కంగారు పడిపోను. ప్రస్తుతం మన సమయం బాలేదని ఊరుకుంటాను. ఎందుకంటే జీవితంలో ఇవన్నీ సహజమని నమ్ముతుంటా. ఇంకొక విషయం ఏంటంటే.. ఇలాంటి సమయంలో పాపని  కన్నందుకు నేను అస్సలు చింతించడం లేదు. నాకు తెలిసినంతవరకూ తల్లి కావడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయం’’ అని అలియా వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని