Alia Bhatt: తల్లయ్యాకా చాలా మారా

యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్నాసరే గ్లామర్‌ పాత్రలకంటే కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించి తన కెరీర్‌ను కొత్తదారిలో తీసుకెళ్లింది అలియా భట్‌.

Updated : 08 Dec 2022 06:45 IST

యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్నాసరే గ్లామర్‌ పాత్రలకంటే కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించి తన కెరీర్‌ను కొత్తదారిలో తీసుకెళ్లింది అలియా భట్‌ (Alia Bhatt). ఇటీవల తల్లై మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. తల్లయ్యాకా తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని చెబుతోంది అలియా. ‘‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. దీంతో నా వ్యక్తిగత జీవితంలో చాలా భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు కంటే స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను. అది ఎందుకు? ఎలా? అనే విషయాలు ఇంకా నాకే తెలియడం లేదు. నా ఈ తీరు నా సినిమా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా నాకు తెలియదు. పాత్రల ఎంపికలో కూడా నా నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే చెప్పలేను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేనే ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’అని చెప్పింది అలియా. ఆమె కరణ్‌జోహార్‌ చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీతో పాటు హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ స్టోన్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని