Alia Bhatt: నేను ఇంట్రోవర్ట్‌ను.. అందుకే నా పెళ్లికి 40 మందిని మాత్రమే ఆహ్వానించాను..

తల్లైన తర్వాత కూడా కెరీర్‌లో దూసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు నటి అలియాభట్‌ (Aliabhatt). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నెపోటిజం, రణ్‌బీర్‌తో తన వివాహంపై స్పందించారు.

Published : 11 May 2023 21:27 IST

ముంబయి: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తో తన వివాహం గురించి నటి అలియాభట్‌ (Alia Bhatt) పలు అంశాలను వెల్లడించారు. పెళ్లికి అతి తక్కువ మందిని ఆహ్వానించడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎదుటి వ్యక్తులతో అతికీ అతకనట్టు మాట్లాడటం తనకు నచ్చదని.. ఎవరితోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటానని చెప్పారు. అందుకే తాను ఎక్కువమంది ఉండే పార్టీలకూ హాజరు కానని అన్నారు. ‘‘నేను ఒక రకంగా ఇంట్రోవర్ట్‌ అనే చెప్పాలి. బయటవాళ్లతో త్వరగా కలవలేను. అందుకే నా పెళ్లికి కేవలం 40 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాను. ఒకవేళ నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ఎక్కువసేపు మాట్లాడతాను. లేకపోతే అస్సలు మాట్లాడను. అందుకే పార్టీలకు ఎక్కువగా హాజరు కాను. ఏడుగురికి మించి ఉంటే ఆ పార్టీకి నేను దూరంగానే ఉంటా’’ అని అలియా వివరించారు.

అనంతరం ఆమె నెపోటిజంపై మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని సంవత్సరాల నుంచి నెపోటిజం అనేది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చ ఎక్కడ మొదలైందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఇతరులతో పోలిస్తే సినీ పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన నేను సులభంగానే నటిని అయ్యాను. అలాగే, త్వరగా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే, పరిశ్రమలో ఉండే వారందరి కలలు, కోరిక ఒక్కటే. దాన్ని దృష్టిలో ఉంచుకునే నేను ప్రతిరోజూ మరింత కష్టపడి వర్క్‌ చేస్తాను. ఏదో చేశాననే పేరుకి చేయను. గర్వాన్ని తలకు ఎక్కించుకోకుండా మరింత కష్టపడి పనిచేయడంతోనే నేను ముందుకు వెళ్లగలను’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని