Alia Ranbir: వైభవంగా ఆలియా- రణ్‌బీర్‌ వివాహం

బాలీవుడ్‌ ప్రేమికులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరు ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి వైభంగా జరిగింది.

Updated : 08 Dec 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రేమికులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం వీరు ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి వైభంగా జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌ ఈ వేడుకకు వేదికైంది. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది ఆలియా. సంబంధిత ఫొటోలు పేర్‌ చేస్తూ ‘‘గత 5 సంత్సరాలుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా వివాహం జరగడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుంచే (14 ఏళ్ల వయసు) రణ్‌బీర్‌ అంటే ఇష్టం. రణ్‌బీర్‌ నటనకు పెద్ద అభిమానిగా మారిన ఆలియా ‘రాక్‌స్టార్‌’ అనే సినిమా కార్యక్రమంలో అతనితో తొలిసారి మాట్లాడింది. ఆ పరిచయం కాస్తా స్నేహమైంది. తర్వాత ప్రేమ చిగురించింది. రణ్‌బీర్‌ హీరోగా 2016లో తెరకెక్కిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రంలో ఆలియా అతిథిగా కనిపించింది. ఇటీవల.. ‘బ్రహ్మాస్ర్త’లో కలిసి నటించిన ఈ జంట ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’తోనూ సందడి చేయబోతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని