Alia Ranbir: అలియా-రణ్‌బీర్‌ల కుమార్తె పేరు ఇదే.. ఎన్ని అర్థాలో!

తమ కూతురి పేరును తెలియజేస్తూ అలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Published : 25 Nov 2022 01:35 IST

ముంబయి: తమ గారాలపట్టికి అలియాభట్‌ (AliaBhatt), రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor)లు నామకరణం చేశారు. కూతురికి రాహా అని పేరు పెట్టినట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. వివిధ భాషల్లో ఆ పేరుకు అర్థమేంటో వివరించారు. రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని చెప్పారు. తన భర్త రణ్‌బీర్‌ ఆ పేరును నిర్ణయించారని అలియా భట్‌ తెలిపారు. రాహా రాకతో తమ జీవితం కొత్తగా ప్రారంభమైందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు పేరు బాగుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అలియా, రణ్‌బీర్‌ తమ చిన్నారిని మాత్రం చూపించలేదు. కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. నవంబరు 6న పాపకు జన్మనిచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని