Alia bhatt: అలియా, రణ్‌బీర్‌లకు పుత్రికోత్సాహం

బాలీవుడ్‌ హిట్‌ జంట అలియా భట్‌, రణ్‌బీర్‌కపూర్‌లకు పుత్రికోత్సాహం కలిగింది.

Updated : 07 Nov 2022 07:23 IST

బాలీవుడ్‌ హిట్‌ జంట అలియా భట్‌, రణ్‌బీర్‌కపూర్‌లకు పుత్రికోత్సాహం కలిగింది. ఆదివారం అలియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వీళ్లద్దరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా కాన్పు అయినట్టు సన్నిహితులు తెలిపారు. ‘మా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. మా పాప కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనొక మ్యాజికల్‌ గాళ్‌. మేం తల్లిదండ్రుల హోదా అందుకున్నాం అని ప్రకటిస్తూ ఆనందంలో మునిగిపోతున్నాం’ అంటూ అలియా, రణ్‌బీర్‌లు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్‌లో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తర్వాత అది పెద్దల ఆమోదంతో పెళ్లిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని