Aliaabhatt: ఆలియా భట్ ‘సీత’గా ఎలా మారిందో చూశారా?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీత పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.  అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 08 Dec 2021 17:10 IST

మేకింగ్ వీడియోను విడుదల చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సీత పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.  అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్‌.. తాజాగా ఆలియాభట్‌... సీతగా మారిన మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఇందులో ఆలియా రాజమౌళితో కథా చర్చలు జరుపుతూ, సంప్రదాయ లంగా ఓణీ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఇప్పటికే సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు చక్కటి స్పందన వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పక్కన సీతగా కనిపించింది ఆలియా. ఒలీవియా  మోరిస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని