Alia Bhatt: ధైర్యం వచ్చేది అప్పుడే.. : అలియా భట్‌

తమ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘జిగ్రా’.

Published : 15 Jun 2024 00:19 IST

మ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘జిగ్రా’. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ ప్రధాన పాత్రలో అలరించనుంది. వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహిళా ప్రాధాన్య కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి వాసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ఇప్పుడు కొత్త తేదీని ఖరారు చేసింది. ఈ సినిమా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడిస్తూ పోస్టర్‌ని పంచుకుంది. ‘మనకు దగ్గరైన వాళ్లు ప్రమాదంలో ఉన్నప్పుడే వాళ్లని కాపాడేందుకు ధైర్యం వస్తుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఆసక్తికరమైన మలుపులతో ఈ ‘జిగ్రా’ ప్రయాణం ఉండనుందని, థ్రిల్లింగ్‌ అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండమని చిత్రవర్గాలు తెలిపాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని