Gangubai Kathiawadi: ఆజాద్‌ మైదాన్‌లో స్పీచ్‌ అదరగొట్టిన గంగూబాయి

‘బహుశా నా మాటలు మీకు చేదుగా ఉండవచ్చు. కానీ, శ్రద్ధగా వినండి. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది.

Published : 30 Apr 2022 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బహుశా నా మాటలు మీకు చేదుగా ఉండవచ్చు. కానీ, శ్రద్ధగా వినండి. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది. అదెలా అంటారా? మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే.. మేమైతే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం.. అది అంతమే అవ్వదు’ అంటోంది గంగూబాయి. అలియా భట్‌ కీలక పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కాఠియావాడి’. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వేశ్య పాత్రలో అలియాభట్‌ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. గంగూబాయిగా ఆమె పలికించిన హావభావాలు అలరించాయి. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సన్నివేశాన్ని నెట్‌ఫ్లిక్స్‌ పంచుకుంది. కామాటిపురలోని మహిళల హక్కుల కోసం  ఆజాద్‌ మైదానంలో గంగూబాయి స్పీచ్‌ ఇచ్చే సీన్‌కు విజిల్స్‌ పడుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని