Updated : 27 Jun 2022 13:19 IST

Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన ఆమె ‘‘మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పెట్టిన పోస్ట్‌పై సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆలియాకు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఏప్రిల్‌ 14న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆలియా చెప్పిన శుభవార్తతో.. భట్‌, కపూర్‌ కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

బీటౌన్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆలియా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగువారికి చేరువయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈసినిమాలో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె, తన భర్తతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమా మొదటి భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని