alia bhatt: న్యూడ్‌ ఫొటోషూట్‌పై ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నా : అలియా భట్

కాస్మోపాలిటన్‌ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌సింగ్‌(Ranveer Singh) చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా

Updated : 28 Jul 2022 14:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాస్మోపాలిటన్‌ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌సింగ్‌(Ranveer Singh) చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌లలో అత్యధికంగా ట్రోల్‌ అవుతున్న అంశంగా ఈ న్యూడ్‌ ఫొటోషూట్‌ నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చర్చలతో పాటు, సెలబ్రిటీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ అగ్రకథానాయిక అలియాభట్‌(Alia Bhatt) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన ‘డార్లింగ్స్‌’(Darlings) ట్రైలర్‌ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా రణ్‌వీర్‌ వ్యవహారంపై ప్రశ్నించగా..‘రణ్‌వీర్‌ నాకు క్లోజ్‌ ఫ్రెండ్‌. న్యూడ్‌ ఫొటోషూట్‌పై మీరడుగుతున్న ప్రశ్ననే నేను జీర్ణంచుకోలేకపోతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ అతన్ని ప్రేమించేవారే. ప్రస్తుత వ్యవహారంపై నెగెటివ్‌గా మాట్లాడటానికి ఇష్టపడను’ అంటూ తన స్నేహితుడికి అండగా నిలిచింది. ఇంకా తన గర్భాధారణపై వస్తున్న కామెంట్లపై కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక అమ్మాయి ఏం చేసినా దాన్ని వివాదంగా చూపడానికి కొందరు ఆసక్తి చూపిస్తారు. అటువంటి ఉపయోగం లేని అంశాలను నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఇక మహిళలకే ప్రత్యేకమైన కొన్ని గొప్ప విషయాలు ప్లాన్‌ చేసుకోము. అలా జరిగిపోతుంటాయి’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అలియా భట్‌ ప్రధానపాత్రలో నటించిన ‘డార్లింగ్స్‌’ ఆగస్టు5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని