Alia Ranbir: డ్యాన్స్‌తో అదరగొట్టేసిన రణ్‌బీర్-ఆలియా
ఆలియా-రణ్‌బీర్ పెళ్లికి సంబంధించిన వైరల్ ఫొటోలు, వీడియోలు
నెట్టింట వైరల్‌గా మారిన వీడియోలు, ఫొటోలు
ఇంటర్నెట్‌డెస్క్: తమ ఐదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు బాలీవుడ్ జంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’తో ప్రేమికులుగా మారిన ఈ జంట.. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఒక్కటైంది. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరూ కలిసి నివసిస్తోన్న ముంబయి బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లోనే వీరి పెళ్లి జరిగింది. పెళ్లి ఫొటోలను ఆలియా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలియా-రణ్‌బీర్ వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
సంగీత్‌లో సందడి..!
అతి తక్కువమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. మహేశ్‌భట్, కపూర్ కుటుంబాలతోపాటు నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ వేడుకల్లో భాగమయ్యారు. వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం సంగీత్ నిర్వహించినట్లు తెలుస్తోంది. షారుఖ్ సినిమాలో ‘చయ్యా చయ్యా’ సాంగ్‌కు వధూవరూలిద్దరూ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ నుంచి ‘రాధా’ సాంగ్‌కు కరణ్-ఆలియా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రొఫైల్ పిక్ మార్చేసిన ఆలియా..!
ఆలియాభట్ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా అప్‌డేట్స్‌తోపాటు తన జీవితంలోని ప్రత్యేక సందర్భాలను ఆమె తరచూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో వివాహమైన అనంతరం ఆమె తన ఇన్‌స్టా ఖాతా ప్రొఫైల్ పిక్ మార్చేసింది. పెళ్లి ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. మరోవైపు ఇంతకాలం సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న రణ్‌బీర్ సైతం త్వరలో నెట్టింటిలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలని దీవించండి..!
ఆలియా-రణ్‌బీర్ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్స్‌ని అందించేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు, మీడియా వాళ్లు గత రెండు రోజులుగా వాస్తు అపార్ట్‌మెంట్ పరిసరాల్లోనే ఉంటున్నారు. దీంతో వాస్తు అపార్ట్‌మెంట్ ఎదుట నూతన దంపతుల కోసం ఎదురుచూస్తున్న మీడియాకి గురువారం మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్వీట్స్ అందించారు. అనంతరం రణ్‌బీర్-ఆలియా మీడియా ముందుకు వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక, నీతూ కపూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్లిద్దరూ ఒక్కటైనందుకు మాకూ ఆనందంగా ఉంది. వాళ్లు ఎప్పుడూ అలాగే ఆనందంగా ఉండాలని మీరూ దీవించండి’’ అని కోరారు.
పది రోజుల క్రితమే అనుకున్నారు..!
ఆలియా-రణ్‌బీర్‌లను సర్‌ప్రైజ్ చేయడానికి కపూర్, భట్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా డ్యాన్స్ చేశారు. ఇందుకోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేంద్రసింగ్ వారికి డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. కేవలం పదిరోజుల క్రితమే రణ్‌బీర్-ఆలియా పెళ్లి ఫిక్స్ చేశారని ఆయన తెలిపారు.
దీపిక, కత్రినా విషెస్..!
ఆలియా-రణ్‌బీర్ పెళ్లి వార్తతో బాలీవుడ్‌లో సందడి నెలకొంది. వీరి పెళ్లి వార్త తెలియగానే అభిమానులతోపాటు సెలబ్రిటీలు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, సమంత, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, అనిల్ కపూర్, దియా మీర్జా, మనీశ్ మల్హోత్ర, సానియా మీర్జా, సోనమ్, మాధురి దీక్షిత్.. ఇలా పలువురు స్టార్స్ ఈ జోడికి కంగ్రాట్స్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
DGCA: పైలట్లు పెర్ఫ్యూమ్లు వాడొద్దు.. డీజీసీఏ ముసాయిదా!
-
EU Meet: ఈయూ విదేశాంగ మంత్రుల భేటీ.. ఉక్రెయిన్ వేదికగా ఇదే తొలిసారి!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు