Gangubai Kathiawadi: ఆలియాభట్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది..!
బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా చేసుకుని...
ముంబయి: బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం బీటౌన్ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ఉదయం వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 25న దీన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్