Raadhika: తారక్‌తో నటించాలని ఉంది..‘RRR’లో రామ్‌చరణ్ నటన అద్భుతం: రాధిక
ఇంటర్నెట్ డెస్క్: తెలుగమ్మాయి కాకపోయినా భాషను, ప్రాంతాన్ని సొంతం చేసుకున్న నటి ఆమె.. ఏ పాత్ర చేసినా ఒదిగిపోయే తత్వం... కలివిడితనంతో ప్రత్యేకతను రాధికా శరత్‌కుమార్ నిలుపుకొన్నారు. ప్రఖ్యాత దర్శకులందరితో పాటు ఉద్దండ నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవిలతో నటించినా ఎక్కడా గర్వం కనపడదు. తమిళంలో తొలి సినిమా చేసినా తెలుగులోనూ సత్తా చాటారు. అమితాబ్ లాంటి లెజెండ్తోనూ నటించి ఔరా అనిపించారు. ఆలీతో సరదా కార్యక్రమం(రెండో భాగం)లో తన అనుభవాలను పేర్కొన్నారు.
మీరు ఏ గేమ్స్ ఆడతారు..? మీకు ఇష్టమైన ఆట ఇక్కడ ఆడాలి..?
రాధిక: పాఠశాల స్థాయిలో నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్ ప్లేయర్‌ను. సీసీఎల్ ప్రాంఛైజీలో భాగస్వామిగా ఉన్నా. చిన్నప్పటి నుంచే టామ్‌బాయ్‌లా పెరిగా. మా వీధిలో అబ్బాయిలను కూడా కొట్టా. ఏ ఆటలోనైనా నేనే గెలుస్తా.
టామ్‌బాయ్‌గా ఉండే మిమ్మల్ని కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’లో హీరోయిన్గా ఎలా తీసుకున్నారు...?
రాధిక: ఆ సినిమాకు ఎంపికైనప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా భావించా. కమల్‌హాసన్‌తో తొలిసారిగా నటించడం చాలా గొప్ప అనుభూతి. మైసూర్లో జరిగిన పాట మనసు పలికే.. షూటింగ్లో చాలా రొమాంటిక్‌గా ఉండాలని విశ్వనాథ్‌గారు చెప్పారు. నేను నటించాను. ఆయనకేదో నచ్చలేదు. నాకు, కమల్‌కూ కెమిస్ట్రీ సరిగా లేదన్నారు. పేకప్ చెప్పారు. ‘కమల్ ఫెర్ఫ్యూమ్ ఇటివ్వు’ అని తీసుకొని ఆయనపై కొట్టారు. నేనొదో విశ్వనాథ్‌తో అన్నానని కమల్ అనుకున్నారు. ‘నేను మొదటి సారి కమల్‌తో నటిస్తున్నా. మా ఇద్దరి మధ్య స్నేహం పెద్దగా లేదు’ అని చెప్పా. సాయంత్రం కూర్చొని మాట్లాడుకోవడంతో తర్వాత పాట షూట్ సరిగా పూర్తయ్యింది.
స్వాతిముత్యం చేస్తున్నపుడు కథ విన్నారా..?
రాధిక: విన్నాను. చాలా డిఫరెంటుగా అనిపించింది. విశ్వనాథ్‌గారు హీరోయిన్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆ నమ్మకంతో సినిమాను ఒప్పుకున్నా. స్వాతికిరణం చేశా. ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మీ సినిమా చేయాలని మూడేళ్లు ప్రయత్నించారు. అందులో మోహన్‌లాల్ హీరో. ఆ క్యారెక్టర్ చేయడానికి భయం వేసింది. ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు కలిశా..నాకు ఆ సినిమా చేయలేదని విశ్వనాథ్ గారు మళ్లీ అడిగారు.
‘అభిలాష’ సమయంలో చిరంజీవికి మీకూ మాటలు లేవు. ఫైట్ జరిగిందా..?
రాధిక: యురేకా సాంగ్ చేసేటప్పుడు మాట్లాడుకోలేదు. పాఠశాల పిల్లల్లాగే అల్లరి చేసేవాళ్లం. సురేఖ మా మధ్యలో రెఫరీ. నాకొచ్చిన తిట్లన్నీ తిట్టేదాన్ని. రెండు, మూడు రోజులు మాట్లాడుకోలేదు..ఆ తర్వాత మళ్లీ మామూలే.
చిరంజీవితో ఎన్ని సినిమాలు చేశారు..? ఎక్కడ కనిపించినా అల్లరి తగ్గలేదనుకుంటా..?
రాధిక: దాదాపుగా పాతిక సినిమాలుంటాయి. చిరంజీవి నన్ను రౌడీ అంటారు. కానీ నేను మంచి అమ్మాయిని. చిరుతో మాట్లాడే భాష మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. పెరిగాం. ఆయన ఎదుగుతున్న కొద్దీ చాలా గర్వపడేదాన్ని. ఇప్పటికీ చిరంజీవిని చూస్తే చాలా గర్వపడతా. రామ్‌చరణ్‌ను చూసినా అంతే గర్వపడుతా. ‘ఆర్ఆర్ఆర్’ చూశా. రామ్‌చరణ్ నటన సూపర్. ఏదైనా సినిమా విడుదలయినపుడు ఫోన్ చేసి నేను గర్వపడుతున్న తీరును చెబుతా. అలా హార్డ్‌వర్క్ చేసే యాక్టర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఖైదీ విడుదలవగానే చూడు రాధిక నేను పెద్ద హీరోనయ్యాను అని చెప్పారు.
టుమారోను తెలుగులో అంటే మీకు భయమట ఎందుకు..?
రాధిక: తొలినాళ్లలో సెట్లో అందరూ రేప్ గురించే మాట్లాడుతున్నారు. ఏంటది అనుకునే దాన్ని. ఆ విషయం అమ్మతో చెప్పా. క్రాంతిగారొచ్చి..ఏ పిచ్చి..రేపు అంటే టుమారో అని చెప్పారు.
మీరు పనిచేసిన సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా ఓ ఆవిడ పని చేసింది..?
రాధిక: సుహాసిని. మెట్టి అనే సినిమాకు ఆమె కెమెరా అసిస్టెంట్.
కెమెరా అసిస్టెంట్‌గా ఉంటూ హీరోయిన్గా టర్నింగ్ ఎలా..?
రాధిక: అప్పుడు అశోక్‌కుమార్ కెమెరామెన్. మేకప్, లిప్‌స్టిక్ వేయకూడదు. అన్నేచురల్గా ఉండకూడదనేవారు. హాసిని రోజూ క్లాస్ తీసుకునేది. ఒక రోజు చూస్తే తను యాక్ట్ చేస్తోంది. కమింగ్ అంటూ హాసినిని పిలిచా హీరోయిన్ అంటూ ఎగతాళి చేశా. క్రాంతిగారికి నేనే పరిచయం చేశా. అది స్వాతి సినిమా. బావమరదళ్లు సినిమాలో శోభన్‌తో కలిసి ఇద్దరం నటించాం. అప్పుడే హాసినిని ర్యాగింగ్ చేశా. ‘మేకప్ వేసుకుంటున్నావా. లిప్‌స్టిక్ వేస్తున్నావా’ అనే సరికి రాధికను అక్కడి నుంచి వెళ్లమని చెప్పండి అంటూ అరిచేది. భారతీరాజా చిరంజీవితో చేసిన ‘ఆరాధన’లో ఇద్దరం నటించాం. రాత్రంతా మాట్లాడుకునే వాళ్లం. ఆ నాటి స్నేహం ఇన్నాళ్లు ఉంది.
ఇప్పటి జనరేషన్లో ఇలాంటి స్నేహం ఉందా..?
రాధిక: ఇప్పుడు చాలా మంది క్యారావాన్‌లో ఉంటున్నారు. కానీ వెంకీ, రవితేజ, శర్వానంద్ లాంటి వాళ్లు చాలా సరదాగా ఉంటారు.
ఇప్పటి జనరేషన్లో బాగా నచ్చిన తెలుగు హీరో ఎవరూ..?
రాధిక: తారక్. చాలా ఇష్టమైన నటుడు. ఆ పేరు నచ్చి గ్రాండ్సన్ పేరు కూడా తారక్ అని పెట్టుకున్నాం.
తారక్‌ను ఎప్పుడయినా కలిశారా..? తారక్‌కు అత్తలానా..? అమ్మలా నటించాలనుకుంటున్నారా..?
రాధిక: ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు. నేను తారక్‌తో కలిసి నటించాలనే కల ఉంది. ఏదో ఒకటి పాత్ర చేయాలి. నటించాలంతే. మంచి నటుడే కాదు..డ్యాన్సర్ కూడా. తెలుగులో ఇప్పుడున్న యంగ్స్టార్ను చూడండి..అందరూ నైపుణ్యం ఉన్నవాళ్లే. రామ్‌చరణ్, బన్నీ..వీళ్లందరినీ ఎత్తుకున్నా. సుస్మితను మొట్టమొదటిగా నేనే చూశా. నాలాగా రౌడీ కావొద్దని దీవించా.
శరత్‌కుమార్ మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు..? కోపం వస్తే ఏమంటారు..?
రాధిక: మామూ..మామ అని..కోపం వస్తే రాధిక అంటారు. నేను శరత్ అంటాను. అంటే సైలెంట్ కావాలని అర్థం.
శరత్‌కుమార్ కాఫీ తాగాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా మీరే చెప్పాలట..?
రాధిక: మీకూ తెలిసిపోయిందా..నన్ను టార్చర్ చేస్తారండి. నేను లండన్‌లో ఉన్నా.. కిచెన్‌కు ఫోన్ చేసి కాఫీ ఇవ్వమని చెప్పు అనేవారు. ‘మీరు అక్కడే ఉన్నారు కదా! ఫోన్ చేసి చెప్పొచ్చు కదా’ అంటే..నువ్వే చెప్పు అంటారు. కాఫీ కప్పు పక్కనే ఉన్నా.. మామ అంటూ కేకలేస్తారు.
మీరు అద్భుతంగా వంట చేస్తారట కదా..శరత్గారికి ఇష్టమైన వంట ఏది..?
రాధిక: ఆయనకు నాన్ వెజ్ అంటే ఇష్టం. ఆయిల్ తక్కువగా ఉండాలి. నేను ఏదీ చేసినా ఇష్టపడి తింటారు.
తెలుగులో ఏ హీరోయిన్ అంటే ఇష్టం..?
రాధిక: సాయిపల్లవి, అనుష్క, త్రిష..
మీరు బాలుతో సినిమా చేశారు. ఆ అనుభవం ఎలా ఉంది..?
రాధిక: ఆయనను చాలా మిస్ అయ్యాం. ఆయన గొంతువినకుండా ఉండలేం. ఆయన చనిపోవడానికి కొద్దిరోజుల ముందు మేసేజ్ పంపించా. ‘కరోనాతో తెలిసిన వాళ్లు చనిపోతున్నారు. ఉదయం లేవగానే మీ గొంతు వినడంతో కలిగే సంతోషం మాటల్లో చెప్పలేను’ అంటూ చేసిన మేసేజ్ చివరిదని తెలియదు. నేను ఆయనతో ఓ పాప లాలీ సినిమాలో నటిస్తానని అనుకోలేదు. చాలా సంతోషపడ్డారు. స్క్రిప్టు చాలా బాగుంది. హీరో ఎవరని అడిగితే బాలుగారన్నారు. వెంటనే ఒప్పేసుకున్నా.
నటరాజస్వామిలా మీరు నిలబడి ఉన్నారు..అది చూసి కమలహాసన్ ఏదో అన్నారట..?
రాధిక: నాకు భరతనాట్యం రాదు. ఓసారి కమలహాసన్ పిలిచి.. ‘నీ భరతనాట్యం చూశా.. దరిద్రంగా ఉంది. పాదం భూమిని చూసి పెట్టాలి. మీరు ఆకాశాన్ని చూసి పెట్టారు. సిగ్గులేదు నీకు’ అంటూ తిట్టారు. పెద్ద ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా నటించిన వయ్యారిభామలు..వగలమారి భర్తలు సినిమాలో శ్రీదేవి పక్కన నేను భరతనాట్యం చేయాలి.. ఏడుస్తూనే ఉన్నా. ఎన్టీఆర్‌గారు మూడవుట్ అయ్యారు. ఆయనకు డ్యాన్సులేదు. మాకు మాత్రమే ఉంది. షాట్ అయిన తర్వాత భరతనాట్యం మూవ్మెంట్ వేసి చూపించారు. వండర్ఫుల్ చాలా బాగా చేశారు.
సందెపొద్దుల కాడ..అనే పాట మీరూ చిరంజీవిగారే కంపోజ్ చేసుకున్నారట కదా..?
రాధిక: అవును. అభిలాష ఒక్క సాంగ్ మిగిలిపోయింది. డ్యాన్స్‌మాస్టర్ లేరు. ఊటిలో ఇద్దరం మాట్లాడుకొని ఐదు గంటల్లో పూర్తి చేశాం.
ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేశారు..? అమితాబ్‌తో నటించడం ఎలా ఉంది..?
రాధిక: తెలుగులో 150 సినిమాల్లో చేశా. బాలచందర్‌తో చేయలేదు. అన్ని భాషల్లో కలిసి 260 దాటానని ఎవరో చెప్పారు. అమితాబ్‌తో కూడా నటించాను. నా కల నెరవేరింది. ఆయన చాలా క్లాస్. షోలే సినిమా 28 సార్లు చూశా. ఆయనలా చెన్నైలో తిరిగేదాన్ని.
నిరోషాను మీరే పరిచయం చేశారా..? తన టాలెంట్‌తోనే పైకి వచ్చిందా..?
రాధిక: నేను పరిచయం చేయలేదు. మణిరత్నం సినిమాతో వచ్చింది. తెలుగులో ఘర్షణ..కార్తిక్,ప్రభు నటించారు. అమల కూడా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
-
India News
PM Modi: వెంకయ్యనాయుడి నుంచి సమాజం చాలా నేర్చుకోవాలి: ప్రధాని మోదీ
-
Sports News
CWG 2022: కామన్వెల్త్ చివరి రోజు.. మరో ఐదు స్వర్ణాలే లక్ష్యంగా..
-
Sports News
Avinash Sable: స్టీపుల్‌ఛేజ్.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!
-
Movies News
40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.. స్టార్ హీరో ఎవరో తెలియదన్నాడు
-
Sports News
CWG 2022: ఐస్‌క్రీం ఇప్పుడు తినొచ్చు.. ఇదే అమ్మకు బర్త్‌డే గిఫ్ట్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస