ఆలీతో ‘జబర్దస్త్‌’ కమెడియన్ల అల్లరి

మనం ఏ చేయాలో ఇండస్ట్రీ నిర్ణయిస్తుందని అంటున్నాడు జబర్దస్త్ కమెడియన్‌ ఆటో రామ్‌ప్రసాద్. తాను ఇండస్ట్రీకి రాకముందు మెడికల్‌ షాప్‌లో.....

Updated : 11 Jun 2021 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఏ చేయాలో ఇండస్ట్రీ నిర్ణయిస్తుందని అంటున్నాడు జబర్దస్త్ కమెడియన్‌ ఆటో రామ్‌ప్రసాద్. తాను ఇండస్ట్రీకి రాకముందు మెడికల్‌ షాప్‌లో పనిచేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. యాక్టర్‌ కావాలని వచ్చి ఎడిటర్‌గా చేరాల్సి వచ్చిందన్నాడు. తన గృహ ప్రవేశానికి మెగాస్టార్‌ చిరంజీవి కొత్తబట్టలు పంపించారని చెప్పారు.

2002లో ప్రభాస్‌ చిత్రం ‘ఈశ్వర్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని జబర్దస్త్ కమెడియన్‌ హాస్యనటుడు అదిరే అభి అన్నాడు. ప్రభాస్‌తో పాటే ఇండస్ట్రీకి పరిచయమైన తాను ‘బాహుబలి’కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అక్కినేని నాగేశ్వర్‌రావు దగ్గరి వెళ్లి ‘యాక్టర్‌ కావాలనుకుంటున్నాను.. ఆశీర్వదించండి అంటే. కాళ్లు మొక్కినంత మాత్రాన యాక్టర్‌ కాలేరు’ అని ఆయన అన్నారని అభి గుర్తు చేసుకున్నాడు.

‘ఈటీవీ’లో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో జబర్దస్త్‌ కమెడియన్లు అదిరే అభి, ఆటో రామ్‌ప్రసాద్‌ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఇద్దరూ సరాదా సమాధానాలు ఇచ్చారు. ఈ పూర్తి కార్యక్రమం జూన్‌ 14న ‘ఈటీవీ’లో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని