vinod kumar: నన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు!
మౌనపోరాటంలో క్లిష్టమైన పాత్ర చేసినా, లెజండ్ డైరెక్టర్ దాసరితో కలిసి మామగారులో నటించినా ఎక్కడా పరిధి దాటలేదు.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆజానుబాహుడు.. విభిన్న పాత్రలతో ఆకట్టుకొని.. ఎవర్గ్రీన్ స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు వినోద్‌కుమార్. ‘మౌన పోరాటం’లో క్లిష్టమైన పాత్ర చేసినా, లెజండ్ డైరెక్టర్ దాసరితో కలిసి ‘మామగారు’లో నటించినా ఎక్కడా పరిధి దాటలేదు. దక్షిణాది భాషల్లో హీరోగా, నటుడిగా ఇప్పటికీ నటిస్తున్నారాయన.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వినోద్‌కుమార్ వచ్చారు. ఎన్నో ఆసక్తికర విషయాలను ముఖాముఖిలో పంచుకున్నారు.
అల్వా.. ఇంటి పేరేంటి?
వినోద్‌కుమార్: అసలు పేరు వినోద్‌కుమార్ అల్వా. కన్నడలో వినోద్ అల్వా అని పెట్టారు. కర్ణాటకలో అప్పటికే నా కజిన్ జీవరాజ్ అల్వా మంత్రిగా ఉన్నారు. చాలా ఫేమస్. నన్ను కూడా వినోద్ అల్వా అని పిలిచారు. ‘మౌన పోరాటం’ చేసేందుకు వచ్చినప్పుడు అట్లూరి రామారావుగారు ‘బాబూ నీ అసలు పేరేంటి’ అని అడిగారు. ‘వినోద్‌కుమార్ అల్వా’ అని చెప్పా. అల్వా తీసేసి వినోద్‌కుమార్ పెట్టేద్దామని చెప్పారు.
సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది..?
వినోద్‌కుమార్: మంగళూరు నుంచి ముంబయికి వెళ్లిపోయా. అక్కడ జాబ్ చేయాలనుకున్నా. మెడికల్ రెప్‌గా రెండు రోజులు పనిచేశా. ఓ పార్టీకి హోటల్‌కు వెళ్లా. ఇక్కడేదైనా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకున్నా. మేనేజరు పాల్దేశాయ్ను మా కజిన్ పరిచయం చేశాడు. ఉద్యోగం వచ్చింది. మూడు నెలల తర్వాత కన్నడ నిర్మాత అబ్బాయినాయుడు వచ్చారు. ఇద్దరం పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాం. మేం త్వరగానే కలిసిపోయాం. మూడు, నాలుగు నెలల తర్వాత కాల్ వచ్చింది. ‘సినిమాలో నటించాలి బెంగళూరు రండి’ అన్నారు. ‘సార్ నాకు నటన రాదు.. నేను రాలేను.. నేను విదేశాలకు వెళ్లాలి’ అని చెప్పా. అయినా ఆయన ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం మేనేజరు వచ్చి బెంగళూరు విమానం టికెట్లు ఇచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లారు. గుర్రంతో వాకింగ్ చేయమన్నారు. బైక్ నడపమన్నారు.. హీరోయిన్‌తో మాట్లాడించారు.. సాయంత్రం ఎడిటింగ్ చేసి చూపిస్తే ఆశ్చర్యపోయా. స్నేహితులు కూడా హీరోగా చేయమనడంతో కాదనలేకపోయా. మొదటి సినిమా ‘దవురుమను’. తొమ్మిదివేలు పారితోషికం. అది కూడా వద్దన్నా. ఇది తీసుకో అదృష్టంగా మారుతుందని నాయుడుగారు చెప్పారు.
‘మౌన పోరాటం’ అవకాశం ఎలా వచ్చింది..?
వినోద్‌కుమార్: నా మూడో సినిమా ఖుష్బూతో చేశా. విష్ణువర్ధన్ కూడా నటించారు. ఆ సినిమాను అట్లూరి రామారావు చూశారు. ‘మౌనపోరాటం’లో నెగెటివ్ క్యారెక్టర్‌కు కావాలన్నారు. ప్రసాద్‌బాబు కెమెరామెన్ నా పేరు చెప్పారు. అబ్బాయినాయుడితో మాట్లాడి పంపించమన్నారు. మద్రాస్ రాగానే పెద్దాయన రామోజీరావును కలిశా. బాబూ డేట్స్ పంపిస్తామన్నారు. సాయంత్రం దర్శకుడు మోహన్గాంధీని కలిసి మాట్లాడాను.
‘మౌనపోరాటం’ తర్వాత అమ్మాయిల్లో మీపై సాఫ్ట్‌నెస్ ఉండేదా? వీడిని చంపేయాలనే కోపం కనిపించిందా..?
వినోద్‌కుమార్: అమ్మాయిల్లో రెండూ ఉండేవి. ఎంట్రీ నుంచి నేనే హీరో, నేనే విలన్. చాలా అరుదుగా అలాంటి పాత్ర లభిస్తుంది. మొదట్లో ఆ పాత్రపై జాలి ఉంటుంది. సెకండాఫ్‌లో అమ్మాయిని గర్భవతిని చేశాక.. నాకే ఇబ్బందిగా అనిపించింది.
ఎన్ని సినిమాలు చేశారు..?
వినోద్‌కుమార్: హీరోగా 140, ఇతర పాత్రలు 20.. తెలుగులో 110, కన్నడలో 30, మలయాళంలో ఒకటి, తమిళంలో రెండు చేశా.
బాగా పేరొచ్చిన సినిమా ఏది..?
వినోద్‌కుమార్: ‘మామగారు’ మంచి పేరు తెచ్చింది. మౌనపోరాటం, సీతారత్నం గారి అబ్బాయి. కర్తవ్యం, భారత్‌బంద్, పోలీస్బ్రదర్ లాంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి.
మోహన్‌గాంధీతో ఎన్ని సినిమాలు చేశారు? ఆయనతో పనిచేయటం ఎలా అనిపించింది?
వినోద్‌కుమార్: దాదాపుగా ఐదు సినిమాలు చేశా. అందులో మూడు ఉషాకిరణ్‌మూవీస్ వాళ్లవే. ఏ ఆర్టిస్టు అయినా ఒకసారైనా మోహన్‌గాంధీతో పని చేయాలి. నటన నేర్పుతారు. ఆయనకు పర్ఫెక్షన్ ఉండాలి.
దాసరి దర్శకత్వంలో నటిస్తూనే ఆయనతో తెర పంచుకోవటం ఎలా అనిపించింది?
వినోద్‌కుమార్: ఆయనో డిక్షనరీ. లెజెండ్. దాసరి, కోడి రామకృష్ణతో పని చేయడం అదృష్టం. దాసరితో ‘నియంత’, ‘మామగారు’ చేశా. చాలా మంచి వ్యక్తి. అలాగే మంచి భోజన ప్రియుడు. తనతో పాటు ఉన్న వాళ్లకు కూడా అన్నీ అందేలా చేస్తారు.
వినోద్ మినీ సైజ్ ముఖేష్ అంబానీ అంటారు..? ఆస్తులు బాగా సంపాదించారట?
వినోద్‌కుమార్: జీరో సైజ్ ముఖేష్ అంబానీ కూడా కాదు.. అంత ఉంటే లండన్‌లో ఉండే వాడిని. హీరో శోభన్‌బాబు నాకు ఆదర్శం. రూపాయిలో 60పైసలు పొదుపు చేసి భూములు కొన్నా. 40పైసలు ఖర్చు పెట్టేవాడిని.
ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
వినోద్‌కుమార్: లవ్ చేసి చేసి విసిగిపోయి.. పెద్దలు కుదిర్చిన మ్యారేజీ చేసుకున్నా. మాకు ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి సినిమాలకు సిద్ధమవుతున్నాడు. ‘నీ ప్రయత్నాలు నీవే చూసుకోవాలి’ అని చెప్పా. వాడిపేరు అనోజ్ అల్వా. వాడికి తెలుగులో చేయాలని ఉంది. చిన్నోడు లా చదువుతున్నా మంచి విలన్‌గా చేయాలనే ఆలోచన ఉంది.
‘మౌనపోరాటం’లో సాయికుమార్ ఓ డైలాగ్ రాసిచ్చారట ఏంటీ...?
వినోద్‌కుమార్: పెద్ద డైలాగ్ రాసిచ్చాడు. అన్నీ బూతులే. నా గురించి నేనే తిట్టుకునేవి. పబ్లిక్‌లో చెబుతుంటే అందరూ నవ్వుకోవడంతో ఆశ్చర్యమేసింది. ‘భారత్‌బంద్’ నుంచి సాయితో అనుబంధం మొదలైంది.
మీ ఆవిడ షూటింగ్ చూసేందుకు వచ్చి చూడలేక మధ్యలోనే వెళ్లిపోయారట ఎందుకు..?
వినోద్‌కుమార్: ఆ రోజు ఆమనితో పాట షూటింగ్ చేస్తున్నారు. మామూలుగా మేకప్ వేసుకుంటేనే నవ్వుతుంది. సినిమాలు కూడా చూడదు. రొమాంటిక్ సాంగ్ కావడంతో చూడలేక వెళ్లిపోయింది.
ఒక థియేటర్లో సినిమాకు వెళ్తే యాజమాన్యం సన్మానించిందట..? ఎక్కడ..?
వినోద్‌కుమార్: నా ఫ్రెండ్ ఆయూబ్‌తో తిరుపతిలో ‘మౌనపోరాటం’ సినిమాకు వెళ్లా. వెనకసీట్లో కూర్చున్నా.. ప్రేక్షకులు గుర్తుపట్టారు. అల్లరి చేశారు. సెకండాఫ్ మరింత ఇబ్బందిగా ఉంటుందని వెళ్లిపోతామనుకున్నాం.. ఇంతలో ఓనర్ వచ్చి బాల్కనీలోకి తీసుకెళ్లారు. సన్మానించారు. బయటకు వెళ్లడం కుదరలేదు. కొత్త మారుతి 800 కారు డోర్ లాగేశారు. అప్పుడే హీరో అయితే ఎలా ఉంటుందో తెలిసింది.
వినోద్ సాఫ్టా, యారగెంటా..?
వినోద్‌కుమార్: ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటా. తెలుగులో ఎన్నో సినిమాలు చేశా. ఎవరితో దురుసుగా, అహంకారంతో మాట్లాడలేదు. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. సొంతూరులో పనులు కావాల్సి వచ్చినప్పుడు ఇంటి దగ్గర మాత్రం కఠినంగానే ఉంటా. మనిషికి రెండూ ఉండాలి.
చిన్నప్పుడు మీ సోదరిని మాస్టారు కొడితే నువ్వెళ్లి మాస్టారును కొట్టావట..?
వినోద్‌కుమార్: స్కూల్లో బాగానే అల్లరి చేసేవాడిని. ముగ్గురు సిస్టర్లు అంటే చాలా ప్రేమ. వాళ్ల పెళ్లి నేనే చేశా. నాన్నకు స్థాయి ఉంది. ఇందిరాగాంధీ చట్టం చేయడంతో 200 ఎకరాల్లో 30 ఎకరాలు మిగిలింది. సినిమాలు హిట్ అయ్యాయి. డబ్బు చేతిలో ఉంది. అందుకే నేనే పెళ్లి చేశా.
సీతారత్నంగారి అబ్బాయి సినిమాలోకి రోజా ఎలా వచ్చింది..?
వినోద్‌కుమార్: ముందుగా ఈ సినిమాలో వేరే హీరోయిన్ అనుకున్నారు. సర్పయాగం సినిమా షూటింగ్లో శోభన్‌బాబు గారిని కలవడానికి వెళ్లినపుడు రోజాను చూశా. రికమెండేషన్ కాదు.. కానీ మన సినిమాకు రోజా బాగుంటుందని ఈవీవీగారికి చెప్పా తీసుకున్నారు.
ఎవరైనా చెప్పారా..క్రికెటర్ రవిశాస్త్రిలా ఉంటావని.?
వినోద్‌కుమార్: చాలామంది చెప్పారు. ఇన్ని సినిమాలు చేశానంటే తెలుగు ప్రేక్షకులే కారణం. 110 చిత్రాలకు పైగా సినిమాలు చేయాలంటే మామూలు విషయం కాదు.. డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నిషియన్లు, ప్రేక్షకులే కారణం..నా సినిమాలు నేనెప్పుడు చూడలేదు. అవన్నీ గుర్తుకు వచ్చేసరికి కన్నీళ్లు వచ్చాయి. కెరీర్ విషయంలో అందరూ సాయం చేశారు. అందుకు థ్యాంక్స్
2005 తర్వాత సినిమాలు ఎలా తగ్గిపోయాయి..ఎందుకు..?
వినోద్‌కుమార్: కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలు తగ్గిపోయాయి. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు చిత్రసీమ తరలిరావడంతో కొంత గ్యాప్ వచ్చింది.
ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
వినోద్‌కుమార్: సాయి, సుమన్, భానుచందర్, నువ్వు(ఆలీ) శ్రీకాంత్, చిట్టీ. ఇలా చాలా మంది నాకు మిత్రులున్నారు.
1991లో అసెంబ్లీ ముందు షూటింగ్ చేస్తున్నప్పుడు సమస్యలు వచ్చాయట..?
వినోద్‌కుమార్: అసెంబ్లీ ముందు కోడిరామకృష్ణ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు పోలీసులు అందరినీ తీసుకెళ్లారు. నేను కారు దగ్గర పోలీసు డ్రెస్‌లో ఉండటంతో పోలీసులు నిజమైన పోలీసునని వదిలేసి వెళ్లిపోయారు. ఆటో పట్టుకొని ఇంటికి వెళ్లిపోయా.(నవ్వులు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్