ఈ బతుకు అవసరమా అనిపించింది: శ్రీలక్ష్మి

‘ఆ రోజుల్లో మనకు కష్టం వస్తే చెప్పుకోగానే తీర్చే వాళ్లుండేవారు. కానీ, ఈరోజుల్లో అలా లేదనిపిస్తోంది.. నమ్ముతారో నమ్మరో నా బాధను గోడతో పంచుకుంటా. ఒకానొక సమయంలో మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా.. ఇదొక్క షాట్‌ తీసి వెళ్లమన్నారు.

Published : 10 Feb 2021 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆ రోజుల్లో మనకు కష్టం వస్తే చెప్పుకోగానే తీర్చే వాళ్లుండేవారు. కానీ, ఈ రోజుల్లో అలా లేదనిపిస్తోంది.. నమ్ముతారో, నమ్మరో నా బాధను గోడలతో పంచుకుంటున్నా. ఒకానొక సమయంలో మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా.. ఇదొక్క షాట్‌ తీసి వెళ్లమన్నారు. ఆఖరికి నేను వెళ్లేలోపే ఆయన చనిపోయారు. అప్పుడు ఛీ.. ఈ బతుకు అవసరమా అనిపించింది’ అని తన మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు నటి శ్రీలక్ష్మి. ప్రముఖ హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’లో నటులు శ్రీలక్ష్మి, హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘కెమెరా ముందు హాయిగా నవ్వుతూ నటిస్తాం.. కానీ,’ అంటూ హేమ సైతం తన కష్టాలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం ఫిబ్రవరి 15న ప్రసారం కానుంది. ఈలోగా ప్రోమోపై ఓ లుక్కేయండి మరి.

ఇవీ చదవండి..

14 ఏళ్లకు బయటకొచ్చిన మహేష్‌ ఫొటో

దేవిశ్రీ.. సాంగ్‌ కంపోజిషన్‌ చూశారా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని