Alitho Saradaga: ‘నన్నే త్రిష అనుకో’.. సంతోష్ శోభన్‌తో ఆలీ సందడి
‘ఆలీతో సరదాగా’ కార్యక్రమ తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ‘ఈటీవీ’లో ఈ నెల 31న రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతుంది.
హైదరాబాద్: తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసిన అతిథులతో కలిసి ఆలీ (Ali) ఎంతటి సందడి చేస్తారో తెలిసిందే. తాజా ఎపిసోడ్‌కు హాజరైన యువ నటుడు సంతోష్ శోభన్ (Santosh Shobhan)తోనూ ఆయన అల్లరి చేశారు. తనకు బాగా ఇష్టమైన నటి త్రిష అని సంతోష్ చెప్పగా.. ‘‘నువ్వు దర్శకుడు శోభన్ తనయుడివని ఆమెకు తెలుసా?’’ అని ఆలీ ప్రశ్నించారు. లేదు అని సంతోష్ సమాధానమివ్వటంతో ‘‘నేనే త్రిష అనుకో’’ అంటూ ఆమెలా హావభావాలు పలికించి కాసేపు నవ్వించారు.
సంతోష్‌తోపాటు కథానాయిక ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ షోలో మెరిశారు. సంతోష్, ఫరియా జంటగా గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share and Subscribe) నవంబరు 4న విడుదల కానుంది. ‘బాబీ’ (మహేశ్‌బాబు), ‘వర్షం’ (ప్రభాస్), ‘చంటి’ (రవితేజ) చిత్రాల దర్శకుడు శోభన్ (దివంగత) తనయుడే ఈ సంతోష్. పలు చిత్రాల్లో బాల నటుడిగా కనిపించిన సంతోష్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా మారారు. ‘పేపర్‌బాయ్’, ‘ఏక్ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా