Faria abdullah: రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది: ఫరియా అబ్దుల్లా
ఆలీతో సరదాగా కార్యక్రమానికి ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share and Subscribe) సినిమా టీం అతిథులుగా వచ్చారు. వాళ్లు ఆ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అతని వాయిస్‌లో ఎంత బేస్ ఉంటుందో.. యాక్టింగ్‌లో అంతకు మించిన గ్రేస్ ఉంటుంది. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాలెంట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan). ఇక చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా(Faria abdullah). వీళ్లిద్దరూ కలిసి ఇటీవల నటించిన సినిమా ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share and Subscribe). మరి ఈ యంగ్ టాలెంటెడ్ నటీనటులు కలిసి ఆలీతో చెప్పిన విశేషాలు, ఈ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఆసక్తికర విషయాలు చూసేద్దామా.
ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
సంతోష్ శోభన్: మా నాన్నగారి పేరు శేఖర్. నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయారు. ఆయన మంచి దర్శకుడు. బాబీ, వర్షం సినిమాలు చేశారు. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నా. ‘గోల్గొండ హైస్కూల్’లో నటించినప్పుడు మంచి పేరు వచ్చింది. హీరోగా ఇప్పటి వరకు 5 సినిమాలు చేశా. వాటిలో పేపర్‌బాయ్ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share and Subscribe) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు.
ఫరియా అబ్దుల్లా: ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like Share and Subscribe) నా రెండో సినిమా. కంగారు లేకుండా ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నా. వైబ్సిరీస్ల్లో కూడా నటిస్తున్నా. నేను ఇక్కడే (హైదరాబాద్) పుట్టా. నాన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పని చేసేవారు. ప్రస్తుతం దుబాయిలో ఉంటున్నారు. నాగ్ అశ్విన్ ఒకసారి మా కాలేజీకి వచ్చారు. అప్పుడు నన్ను చూసి యాక్టర్‌గా చేస్తారా అని అడిగారు. తర్వాత నేను ఫాలో అప్ చేశా. ఆడిషన్ ఉంది అని చెప్పారు. వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. మా ఇంట్లో నన్ను బాగా ప్రోత్సహిస్తారు.
మీకు ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం. ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు?
సంతోష్ శోభన్: నాకు చిరంజీవిగారు, ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్‌ని కలిసే అవకాశం ఎక్కువసార్లు రాలేదు. ఆయన్ని ఎప్పుడు కలిసినా ఓ అభిమాని లాగానే కలుస్తా. హీరోయిన్స్‌లో త్రిష అంటే ఇష్టం.
ఫరియా అబ్దుల్లా: నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగా. తెలుగులో నేను చూసిన మొదటి సినిమా వర్షం. త్రిష అంటే చాలా ఇష్టం. వర్షంలో త్రిష నటన చూసి ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొందంటానా’ సినిమా చూశా. ఆ సినిమా చూశాక, హీరో సిద్ధార్థ్‌ని ఇష్టపడ్డా.
ఎవరి దర్శకత్వంలో నటించాలని ఉంది?
ఫరియా అబ్దుల్లా: నాకు రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలని ఉంది.
సంతోష్ శోభన్: నేను ఎవరితో సినిమాలు చేసినా చేయకపోయినా గాంధీగారు నాతో సినిమాలు చేస్తే ఆయనతో లైఫ్‌లాంగ్ సినిమాలు చేస్తుంటాను. ఆయనంటే నాకు అంత ఇష్టం. ఇప్పటికి ఆయన దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించాను. ఇంకా నటించాలని ఉంది.
మీ రియల్‌లైఫ్‌లో జాతిరత్నం ఎవరు?
ఫరియా అబ్దుల్లా: (నవ్వుతూ)నేనే... నిజంగానే నాకు నేనంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్లినా ఒక్కదాన్నే వెళ్తా. (మధ్యలో ఆలీ మాట్లాడుతూ..అవును నేనే ఎయిర్‌పోర్టులో 10సార్లు చూశాను. నీ హైట్‌కు నిన్ను ఎక్కడ చూసినా గుర్తుపట్టచ్చు)
సంతోష్ శోభన్: నా ఫ్రెండ్స్ అందరూ జాతిరత్నాలే. మన జీవితంలో మంచైనా , చెడైనా వాళ్ల వల్లే జరుగుతుంది. కుటుంబంతో కూడా పంచుకోలేని విషయాలు వాళ్లతో పంచుకుంటాం. నేను స్కూల్ వరకు హైదరాబాద్‌లో చదివాను. డిగ్రీ మాత్రం బెంగళూరులో చదివాను. థియేట్రికల్ బీఏ చేశాను. అది అక్కడ మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. యాక్టింగ్ స్కూల్‌కు వెళదాం అనుకున్నా కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు.
లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా ఐడియా ఎలా వచ్చింది?
గాంధీ: లాక్డౌన్ సమయంలో ఎక్కువ యూట్యూబ్ చూశా. అందులో చాలా మంది ట్రావెల్ వీడియోస్ పెట్టేవారు. ఆసక్తిగా అనిపించింది. అప్పుడే అనుకున్నా ఈ కాన్సెప్ట్‌తో ఓ సినిమా తీద్దాం అని.
మీ అసలు పేరు ఏంటి?మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు?
గాంధీ: నా అసలు పేరు చెగువేరా. మా నాన్న రచయిత. ఆయనకు కమ్యూనిజం అంటే ఇష్టం. అందుకే ఆ పేరు పెట్టారు. మేము పల్లెటూరిలో ఉండేవాళ్లం. అందరికీ ఆ పేరు అర్థం తెలియక అడిగే వాళ్లు. దీంతో మా నాన్నకు విసుగు వచ్చి గాంధీ అని మార్చేశారు. బీటెక్ అయిపోయాక ఎల్.వి ప్రసాద్ ఫిల్మిం స్కూల్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేశా. డైరెక్షన్ వైపు వెళతానంటే మా నాన్న వద్దన్నారు. అందుకే కెమెరామెన్‌గా అయినా జాయిన్ అవుదామని ఆ కోర్సు చేశా. సంవత్సరం అయ్యాక ‘ఖర్మరా దేవుడా’ షార్ట్ ఫిల్మిం తీశాను. దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘వెంకట్రాది ఎక్స్‌ప్రెస్’ సినిమా తీశాను. అలా కొనసాగుతోంది.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్లో నటీనటులను ఎలా ఎంపిక చేశారు?
గాంధీ: ‘ఏక్మినీకథ’ సినిమా చేసేటప్పుడు నాకు సంతోష్ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా నటిస్తాడు. అందుకే ఈ సినిమా కోసం తనని ఎంపిక చేశా. హీరోయిన్గా ఫరియా అబ్దుల్లానే అనుకున్నా. చేస్తుందో లేదో అనే సందేహం వచ్చింది. కానీ తను అడగ్గానే సరే అంది. ఇంకా నా ప్రతి సినిమాలో బ్రహ్మజీ గారు, సప్తగిరి ఉంటారు. ఈ సినిమాలో కూడా ఉన్నారు.
రామ్ చరణ్‌తో ఓ సినిమా అనుకున్నారు కదా? అది ఎందుకు పట్టాలెక్కలేదు?
గాంధీ: ఒక స్టోరీ అనుకున్నాం. అది కంప్లీట్‌గా పూర్తవ్వలేదు. దాని వల్ల ఆగిపోయింది.
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఎలా నటించారని మీరనుకుంటున్నారు?
గాంధీ: లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్లో సంతోష్ చాలా బాగా నటించాడు. మా ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి. ఏక్మినీకథ తర్వాత తనతో చేయడానికి ఇదే కారణం. మంచి ఆర్టిస్టు. చాలా బాగా నటిస్తాడు. ఇక ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఈ సినిమా నవంబర్ 4న విడుదలవుతోంది.
ఏదో సూపర్ మార్కెట్లో దొంగతనం చేశావట? దాని కథ ఏంటి?
ఫరియా అబ్దుల్లా: చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకున్నాం. సూపర్ మార్కెట్‌కు వెళ్లి చిప్స్ పాకెట్స్, చాక్లెట్స్ తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాం. నేను చాక్లెట్ తీసుకుని వచ్చేశాను. మా ఫ్రెండ్స్ దొరికిపోయారు.
జాతిరత్నాలు షూటింగ్ టైమ్‌లో డైరెక్టర్ నిన్ను కొట్టారట నిజమేనా?
ఫరియా అబ్దుల్లా: అది సరదాగా జరిగింది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయనకు అలవాటు. అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు అంతే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కోర్టు ప్రాంగణంలో చిరుత హల్చల్.. ముగ్గురికి గాయాలు
-
Viral-videos News
Viral Video: నడిరోడ్డుపై ‘విచ్చలవిడి’గా.. బైక్‌పై వికృత చేష్టలు.. వీడియో వైరల్!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ ఖరారు.. ఇంకా తేలని బెర్తులు
-
Movies News
Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!